ఎంపీ అరెస్ట్ పై నేను స్పందించకూడదా..?

  0
  39

  ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తప్పుడు కేసులు పెడితే మేము మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎవరికి అన్యాయం జరిగినా నిలదీసేందుకు తమ పార్టీ ముందుంటుందని అన్నారు. ఇటీవల వైసీపీ నేతలు.. రఘురామకృష్ణంరాజు అరెస్ట్ పై చంద్రబాబు స్పందన గురించి కామెంట్లు చేశారు. వైసీపీ ఎంపీ అరెస్ట్ అయితే, చంద్రబాబు అంత బాధపడుతున్నారెందుకంటూ సెటైర్లు వేశారు. దీనిపై చంద్రబాబు ఇలా స్పందించారు.

  తమ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల్ని తీసుకున్నారంటూ వైసీపీ తీరుపై ధ్వజమెత్తారు చంద్రబాబు. రాష్ట్రం అంటే ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదన్నారు. రఘురామ అరెస్టులో పోలీసులు నిబంధనలు పాటించలేదన్నారు. అధికారులు హద్దులు మీరి ప్రవర్తించడంసరికాదని, చట్టానికి లోబడే పనిచేయాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అధికారులు కూడా శిక్షార్హులే అవుతారని చంద్రబాబు అన్నారు.

  ప్రజాస్వామ్యవాదుల పోరాటానికి టీడీపీ మద్దతు ఉంటుందన్నారు. ప్రత్యర్థులపై దేశద్రోహం కేసులు పెడతారని తనకు తెలియదని, మీడియాపైనా రాజద్రోహం కేసు పెట్టే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. హద్దు దాటే అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు.

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.