చంద్రబాబుకి కోపమొచ్చింది..

  0
  693

  నిన్నటికి నిన్న విజయవాడ, గుంటూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజల్ని తిట్టిపోశారు చంద్రబాబు. మీకు సిగ్గులేదా, రోషం లేదా అంటూ రెచ్చగొట్టారు. ఇప్పుడు సొంత పార్టీ నాయకులపైనే తిట్ల దండకం అందుకున్నారు. విధేయతలు, మోహమాటాలు ఇకపై చెల్లవని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నాయకుల క్షేత్రస్థాయి పనితీరుకు అద్దం పడుతున్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెబితే కుదరదని హెచ్చరించారు. వైసీపీ వైఫల్యాలపై పది ముఖ్యమైన అంశాలు గుర్తించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ నేతలు తెగించి పోరాడాలని, అలా తెగించి పోరాడేవాళ్లకే పార్టీలో గుర్తింపు ఉంటుందని తేల్చి చెప్పారు.

  తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని 75 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్‌కు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఐదుగురు సభ్యులతో తిరుపతి ఉపఎన్నిక పర్యవేక్షణ కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. కమిటీలో నారాలోకేశ్, అచ్చెన్నాయుడు, పనబాక కృష్ణయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర సభ్యులుగా ఉంటారు.

  మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం ప్రభావం నుంచి చంద్రబాబు ఇంకా బయటకొచ్చినట్టు లేరు. ఆ ఫ్రస్టేషన్ అంతా.. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో తీర్చేసుకున్నారు.

  ఇవీ చదవండి

  క్షుద్ర పూజలకు అమ్మాయిల అండర్ వేర్లు..

  భార్యల మార్పిడి విషవలయంలో సమిధలు ..

  బాలుడిని లేపుకుపోయిన ముగ్గురు బిడ్డల తల్లి.

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..