ట్రైనింగ్ లేని కుర్రదొంగలు.. బుక్కయ్యారు..

  0
  413

  దొంగతనం చేయడం, తప్పించుకుని పారిపోవడం అంత ఈజీయేం కాదు. సరిగ్గా అలాంటి ప్రయత్నం చేసి ఎక్స్ పీరియన్స్ లేక ఇద్దరు కుర్రదొంగలు పోలీసులకు దొరికిపోయారు. చైన్ దొంగతనం చేసి అడ్డంగా బుక్కయ్యారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బొర్రాయిపాలెంలో ఈ ఘటన జరిగింది. మిర్యాలగూడ మండల పరిధిలోని తుంగపాడ్‌ గ్రామంలో ఓ మహిళ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండాన్ని దుండగులు గమనించారు. స్కూటీపై వచ్చి ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కొని పరారయ్యారు. అప్రమత్తమైన మహిళ సమీపంలో ఉన్న తన బంధువులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చింది.
  స్కూటీపై వచ్చిన దొంగలు, స్పీడ్ గా తప్పించుకునే అవకాశం లేకపోవడంతో.. పక్క ఊరిలోకి వచ్చి ఆగారు. అనుమానంగా ప్రవర్తించడంతో స్థానికులు వారిని పట్టుకున్నారు. అసలు విషయం బయటపడింది. చితకబాది పోలీసులకు అప్పగించారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.