బంపర్ ఆఫర్.. పాత సెల్ ఫోన్లకు బదులుగా ఉల్లిపాయలు..

    0
    331

    పాత బట్టలిస్తే ఉల్లిపాయలిస్తాం అంటూ చాలామంది ఊర్లలో తిరుగుతూ వ్యాపారం చేసుకుంటుంటారు. పాత బట్టలే కాదు, ప్లాస్టిక్ సామాన్లకు కూడా ఉల్లిపాయలు లేదా స్టీల్ గిన్నెలు ఎక్సేంజ్ చేస్తుంటారు. ఇప్పుడీ లిస్ట్ లో స్మార్ట్ ఫోన్లు కూడా చేరిపోయాయి. పాత స్మార్ట్ ఫోన్లు ఇవ్వండి ఉల్లిపాయలు తీసుకోండి అంటూ తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్యాచ్ తిరుగుతోంది. తెలంగాణ, ఏపీలో ఇప్పుడిదే లేటెస్ట్ ట్రెండ్. ఇంకా ఈ ఉల్లిపాయల బండి మీ ఊరు రాలేదని అనుకోకండి, ఈరోజో రేపో మీ ఊరిలో కూడా పాత ఫోన్లకు ఉల్లిపాయలు ఇచ్చే వాళ్లు వస్తారు, కచ్చితంగా ఈ ఇంట్లో ఉన్న పాత ఫోన్లు తీసుకెళ్తారు.

    ఎందుకీ ఫోన్లు.. ?

    దాదాపుగా ప్రతి ఇంట్లో ఇప్పుడు మనిషికో ఫోన్ ఉన్నట్టే.. మనిషికో పాత ఫోన్ కూడా ఉంటుంది. వాడటానికి పనికొస్తుందా లేదా అనేది వేరే సంగతి.. కచ్చితంగా పాత ఫోన్లు మాత్రం ఉండే ఉంటాయి. కొన్నిచోట్ల వాటిని ఎక్సేంజ్ కింద కూడా ఎవరూ తీసుకోరు, దాని రిపేరుకి పెట్టే డబ్బులతో కొత్త పోన్ కొనుక్కోవచ్చు. అందుకే వాటిని అలాగే ఇంట్లో వదిలేస్తుంటారు చాలామంది. బయట పడేయలేరు, ఎవరికైనా ఇచ్చినా తీసుకోరు, అందుకే అలాగే ఇంట్లో వదిలేస్తారు. ఇప్పుడిలాంటి ఫోన్లన్నిటినీ ఉల్లిపాయలకు వేయడం మినహా ఇంకేమీ చేసుకోలేని పరిస్థితి. అందుకే వీటిపై దృష్టి పెట్టింది ఓ పంజాబ్ కంపెనీ. పాత ఫోన్లన్నీ సేకరించి మొబైల్ కంపెనీలకు అమ్మేస్తోంది.

    పాత ఫోన్లకు రేటు కడితే పదో, ఇరవయ్యో ఇస్తామంటే ఎవరూ ముందుకు రారు, అందులోనూ ఆడవాళ్లు అసలే ఇవ్వరు. అందుకే వారిని ఆకట్టుకోడానికి ఇలా పాతఫోన్లకు కొత్త ఉల్లిపాయలు అనే ఆఫర్ పెట్టారు. ఉల్లిపాయు, స్టీల్ గిన్నెలిస్తామంటే.. చీర పాతది కాకపోయినా ఇచ్చేసే మహిళలు చాలామంది ఉంటారు. అలాంటి వారిని ఆకట్టుకోడానికే ఈ ఉల్లిపాయల ఫార్ములా. ఉల్లిపాయల బండితో ఊరిలోకి వచ్చే వ్యాపారులు సంచి నిండా సెల్ ఫోన్లతో తిరిగి వెళ్తున్నారట.

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??