చీటింగ్ కేసులో సినీ నటి దర్శకురాలు జీవిత ..

  0
  253

  సినీ నటి దర్శకురాలు జీవిత చీటింగ్ కేసులో ఇరుక్కుంది . వచ్చేనెల చీటింగ్ కేసుపై నగరి కోర్టులో విచారణ జరగనుంది . ఇది వరకే జీవిత అరెస్టుకు నగరి కోర్టు వారెంటు జారీచేసింది . దీనిపై ఆమె తనపై జారీ చేసిన వారెంట్ రద్దు చేయాల్సిందిగా కోరుతూ కోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ఇప్పుడు పెండింగ్ఉంది . తిరుపతి జిల్లా , విజయపురి మండలానికి చెందిన కోటేశ్వర రాజు అనే వ్యక్తి తన భార్య తరఫున జీవితా రాజశేఖర్ కి , గరుడ వేగ చిత్ర నిర్మాణం కోసం 26 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చారు .దీనికి మద్రాస్ లో తనకున్న మూడు ఎకరాల స్థలాన్ని తాకట్టుపెట్టి ఖాళీ చెక్కులు కూడా ఇచ్చారు .

  అయితే గరుడవేగ చిత్రానికి 26 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని , తాకట్టు పెట్టిన స్థలాన్ని అమ్మేశారు. ఆ స్థలం తమకు తాకట్టు పెట్టిన స్థలంలో నిర్మాణాలు ప్రారంభమయ్యాయని , అప్పు ఇచ్చిన కోటేశ్వర రాజుకు తెలిసింది . దీంతో జీవిత ఆ స్థలానికి మంచి ధర వచ్చిందని , అందుకని తొందర్లో డబ్బులు ఇస్తానని చెప్పిందట. అప్పు ఇచ్చిన డబ్బులు రాకపోవడంతో కోటేశ్వరరావు నగరి కోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు .కేసులో విచారణకు ఆమె హాజరు కాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది . దీంతో వచ్చే నెల ఎనిమిదో తేదీ ఈ కేసులో విచారణ జరగనుంది.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.