అల్లు అర్జున్ అభిమానులపై కేసు..

  0
  85

  బన్నీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులంతా రోడ్లపైకి వచ్చి సందడి చేశారు. అయితే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి వేళ బాణసంచా కాల్చినందుకు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌ తో పాటు మరో అభిమాని సంతోష్‌ పై జూబ్లీహిల్స్‌ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 290, 336, 188 కింద కేసు నమోదు చేశారు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.68లోని ఆయన నివాసానికి వందలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండానే గంటపాటు బాణసంచా కాల్చడంతో చుట్టుపక్కల వారికి తీవ్ర అసౌకర్యం కలిగింది. విపరీతమైన శబ్ధం వల్ల తాము నిద్రకు దూరమయ్యామని పలువురు డయల్‌ 100కు కాల్‌ చేసి చెప్పారు. దీంతో పెట్రోకార్‌ కానిస్టేబుల్‌ విశాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రశాంత్, మరో అభిమాని సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ