ప్రకాశం సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ పై కేసు..

  0
  522

  ఒంగోలులో రెమెడీశ్వర్ ఇంజెక్షన్ల అవినీతిలో ప్రకాశం సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ పై కేసు నమోదైంది. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమంతరావుపై ఒంగోలు వన్ టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ఆయన పరారీలో ఉన్నట్లు తెలిసింది. రెమెడీశ్వర్ ఇంజక్షన్ లు బ్లాక్ లో అమ్ముకున్నట్టు కూడా తేలింది. 3500 ఇంజక్షన్ ను 40 నుంచి 50 వేల రూపాయలకు అమ్ముకున్నట్టు తేలింది. విజిలెన్సు ఎన్ఫోర్స్ మెంట్ డీఎస్పీ అశోక్ వర్ధన్ తన బృందంతో జరిపిన దాడితో ఆసుపత్రిలో స్టాక్ రిజిస్టర్ ప్రకారం 533 ఇంజెక్షన్లు ఉండాల్సివుండగా.. అయితే 476 మాత్రమే ఉన్నాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రెమెడీశ్వర్ ఇంజెక్షన్ల వ్యవహారంలో అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ అయ్యింది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్టు ఎస్పీ సిద్ధార్ధ్ కౌషల్ తెలిపారు. వన్ టౌన్ పోలీసులు, సింగరాయకొండ పోలీసుల ప్రత్యేక బృందాలను సమగ్ర విచారణకు ఏర్పాటు చేశారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.