ఏమిరా .. ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా.?

  0
  6308

  నిన్న హైదరాబాద్ లో బాలరాజు అనే ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే పోలీసును ఒరేయ్.. అని పిలిచి కలకలం రేపాడు. ఈ ఘటన మరువకముందే ఎమ్మెల్యే కారుకు సైడ్ ఇవ్వలేదని.. ఆయన అనుచరులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను కర్రతో కొట్టి.. భీబత్సం సృష్టించారు. బూతులు తిడుతూ బస్సు దిగిరావాలంటూ దుర్భాషలాడారు. రాయితీ ఈ తతంగం మొత్తాన్ని అటుగా వెళ్తున్న బస్సులోనుంచి మరొక వ్యక్తి వీడియో తీశారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో బూతులు తిట్టిన ఎమ్మెల్యే అనుచరులను సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. తెలంగాణా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి బూతులు తిట్టిన ఎమ్మెల్యే అనుచరులపై కేసులు నమోదు చేయించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకునేందుకు వీలు లేదని అతిక్రమిస్తే చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..