లాండింగ్ లో విమానం రెండుగా చీలిపోయింది..

  0
  258

  ఇటీవల ప్రమాదానికి గురయ్యే కార్లు ,ఇతర వాహనాలు రెండుగా చీలిపోవడం చూశాం.. అదేదో విచిత్రంగా భావిస్తాం . దాని గురించి చర్చించుకుంటాం . అయితే ఇప్పుడు ఓ వింత జరిగింది. ఏకంగా ఒక విమానమే రెండుగా చీలిపోయింది . మామూలుగా అయితే ఎవరైనా చెప్తే ఇది నమ్మ లేము , కానీ చూసిన తర్వాత నమ్మక తప్పదు . కోస్టారీకా అంతర్జాతీయ శాంతమేరియా విమానాశ్రయంలో డిహెచ్ఎల్ కంపెనీకి చెందిన కార్గో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.. ల్యాండ్ అయిన తర్వాత పక్కనే ఉన్న పచ్చిక మైదానం లోకి జారి పోయింది . ఆ తర్వాత విమానం రెండుగా చీలిపోయింది.

  వెంటనే పరిస్థితి గమనించిన అగ్నిమాపక దళం రంగంలోకి దిగి విమానం పూర్తిగా కాలి పోకుండా కాపాడగలిగారు. విమానంలోని పైలెట్, కో పైలెట్ ఇద్దరినీ హాస్పిటల్ కి తరలించారు. వారిద్దరి పరిస్థితి బాగానే ఉందని ప్రమాదమేమీ లేదని అధికారులు ప్రకటించారు . గ్వాటిమల పోవలసిన ఈ విమానంలో హైడ్రాలిక్ సిస్టం లో సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్ల విమానం టేకాఫ్ అయిన వెంటనే ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని కోస్టారీకా విమానయాన డైరెక్టర్ చెప్పారు ఈ ప్రమాదం కారణంగా కోస్టారీకా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు..

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..