కరోనా తల్లితో కారులోనే కాపురం..

  0
  1547

  దేశం క‌రోనా కాష్టంపై ర‌గిలిపోతోంది. నిజాన్ని న‌గ్నంగా చెప్పాలంటే కేంద్రం నుంచి రాష్ట్రాల వ‌రకు ప్ర‌భుత్వాల‌న్నీ చేతులెత్తేసి చేష్ట‌లుడిగి చూస్తున్నాయి, శత్రు దేశాలు కూడా మ‌న ప‌ట్ల దీనంగా చూసే ప‌రిస్థితికి దేశాన్ని తీసుకొచ్చేశారు. క‌రోనా రెండో ద‌శ మాన‌వ సంబంధాల‌నే కాదు క‌న్న‌పేగు బంధాల‌ను కూడా ప‌రీక్షించే ప‌రిస్థితికి వ‌చ్చేశాయి. త‌ల్లికి క‌రోనా సోకి ప‌రిస్థితి తీవ్రంగా ఉంటే, బిడ్డ‌లిద్ద‌రూ త‌ల్లిని కారులో పెట్టుకుని ఆస్ప‌త్రిలో బెడ్ కోసం మూడు రోజులుగా తిరుగుతున్న ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ల‌క్కీంపూర్ లో క‌నిపించింది. మూడు రోజులుగా త‌ల్లిని కారులోనే పెట్టుకుని తిప్పుతున్నారు. 45 ఏళ్ళ ప‌రుల్ సింగ్ అనే మ‌హిళకు డ‌యాల‌సిస్ అవ‌స‌ర‌ముంది. ఈలోగా క‌రోనా సోకింది. ఆమెకు డ‌యాల‌సిస్ చేసేందుకు డాక్ట‌ర్లు సిద్దంగా లేరు క‌రోనాకు వైద్యం చేయించేందుకు ఆస్ప‌త్రిలో బెడ్లు దొర‌క‌డం లేదు.

   

  దీంతో ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లోనే త‌ల్లిని కారులోనే పెట్టుకుని కొడుకు ఆకాష్, కూతురు పాయ‌ల్ చికిత్స చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్ప‌త్రిలోనూ బెడ్లు లేవ‌ని నిరాక‌రిస్తున్నారు. ఈలోగా ఆమెకు ఆక్సీజ‌న్ స్థాయి త‌గ్గిపోయింది. దీంతో ఆమెను కార్లోనే బోర్లా ప‌డుకోబెట్టి కృత్రిమ రూపంలో ఆమెకు ఆక్సీజ‌న్ అందేలా చ‌ర్య‌లు తీసుకుంటూ ప్ర‌య‌త్నాలు చేశారు. రెండు రోజుల త‌ర్వాత తండ్రి బ్లాక్ మార్కెట్ లో ఆక్సీజ‌న్ సిలిండ‌ర్ కొని తీసుకొచ్చాడు. కారులో బిడ్డ‌లు ఆమెకు ఆక్సీజ‌న్ పెట్టి, తండ్రికి క‌రోనా సోకుతుంద‌నే భ‌యంతో ఇంటికి పంపించివేశారు. అయితే మూడు రోజుల నుంచి కారులోనే త‌ల్లిని పెట్టుకుని వైద్యం కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోగా కొడుకుకి కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ దారుణ‌మైన ప‌రిస్థితిని సోష‌ల్ మీడియాలో చూసిన అధికారులు నాలుగో రోజుకు ఆమెకు రాంమ‌నోహ‌ర్ లోరియా అనే ఆస్ప‌త్రిలో అడ్మిష‌న్ ఇచ్చారు.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.