హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కు ఉరిశిక్ష.

  0
  859

  ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 13మందిని హత్య చేశారు. అంతే కాదు శవాల్ని కూడా మాయం చేశారు. వాహనాల్ని తుక్కు తుక్కు చేసి ఆనవాళ్లు లేకుండా చేసేవారు. 2008లో ఈ వరుస ఘటనలు ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించాయి. ఈ హత్య కేసుల్లో ప్రధా నిందితుడు మున్నాతోపాటు మొత్తం 12మందికి ప్రకాశం జిల్లా 8వ అదనపు సెషన్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. మరో ఏడుగురికి యావజ్జీవ శిక్ష విధించింది. ఈ తీర్పు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.

   

  13 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై లారీలు, సరకు సిబ్బంది అదృశ్యం అయిన కేసుల్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కారణాలు అంతు చిక్కలేదు. ఒక కేసుకు సంబంధించి అప్పట్లో డీఎస్పీగా శిక్షణ పొందుతున్న దామోదర్‌కు చిన్న ఆధారం లభించింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు విస్మయానికి గురి చేసిన విషయాలు తెలిశాయి. ఒంగోలుకు చెందిన అబ్దుల్‌ సమద్‌, అలియాస్‌ మున్నా ఒక గ్యాంగ్‌ను తయారు చేసుకొని ఈ హత్యలు చేసినట్లు తెలిసింది.

   

  జాతీయ రహదారిపై అధికారిలా కాపుకాసి, లోడ్‌తో వస్తున్న లారీలను ఆపడం, రికార్డులు చూపించాలని కోరడం, అదును చూసి మెడలో తాడువేసి, బిగించి హతమార్చేవాడు. మృతదేహాలను గోతాల్లో కుక్కి తోటల్లో అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టి, లారీని సరకును మాయం చేసేవాడు. ఇలా మొత్తం 13 మందిని హత్య చేసినట్లు విచారణలో తేలింది.

   

  ఈ కేసులో ఓ దఫా బెయిలుపై విడుదలైన మున్నా బెంగళూరు పారిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కర్నూలు పోలీసులు మున్నాని అరెస్ట్ చేశారు. మున్నా, అతని గ్యాంగ్‌ మీద ఏడు కేసులు నమోదయ్యాయి. ఈరోజు కోర్టు తీర్పు వెలువరించింది.

   

  ఈ కేసుపై ప్రకాశం జిల్లా 8వ అదనపు సెషన్స్‌ కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. మొత్తం 7 కేసులకు గానూ 3 కేసుల్లో తీర్పు వెలువరించింది. నేరాలు రుజువవ్వడంతో మున్నా సహా 19 మందికి శిక్ష ఖరారు చేసింది. 12 మందికి ఉరిశిక్ష, ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు