పెళ్లికూతురు ట్రాక్టర్ తోలుకుంటూ వచ్చేసింది..

  0
  103

  ఒక‌ప్పుడు పెళ్ళి కూతురు క‌ళ్యాణ వేదికకు వ‌చ్చేట‌ప్పుడు సిగ్గుమొగ్గ‌ల‌వుతూ వ‌చ్చేది. ఆమె సిగ్గును చూస్తూ పెళ్ళికొచ్చిన వారంతా చూసి మురిసిపోయేవారు. కానీ కాలం మారింది. కాలానికి త‌గ్గ‌ట్టు పెళ్ళి కూతుర్లు మారిపోతున్నారు.

  పెళ్ళి మండ‌పానికి వ‌చ్చే స‌మ‌యంలో వెరైటీగా క‌నిపించాల‌నే ఉద్దేశ్యంతో కొత్త ఆలోచ‌న‌ల‌తో ఎంట్రీ ఇస్తున్నారు. డ్యాన్సులు వేసుకుంటూ రావ‌డం… పాట‌లు పాడుకుంటూ రావ‌డం… బుల్లెట్‌పై రావ‌డం… ఇలా త‌మ‌కు న‌చ్చిన విధంగా క‌ళ్యాణ వేదిక‌కు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఇదే ట్రెడింగ్‌లోనూ ఉంది.

  తాజాగా మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా జావ్రా గ్రామంలో భార‌తి అనే నవ వధువు వినూత్నంగా ఎంట్రీ ఇచ్చింది. ట్రాక్టర్ నడుపుకుంటూ కల్యాణ వేదిక‌కు చేరుకుని షాక్ ఇచ్చింది. సంప్ర‌దాయ పెళ్ళి వ‌స్త్రాలు ధ‌రించి, క‌ళ్ళ‌కు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని.. హుందాగా ట్రాక్ట‌ర్ డ్రైవ్ చేసుకుంటూ రావ‌డం … పెళ్ళికొడుకుతో స‌హా అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆమె అలా రావ‌డం సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..