మాల్దీవుల్లో బోసిడీకే రాజకీయం..

    0
    667

    ఏపీలో బోసిడీకే రాజకీయం ఇప్పుడు మాల్దీవులకు చేరింది. అసలు టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలతోనే ఈ హంగామా మొదలైంది. అలాంటిది… ఇప్పుడు ఆయన ఏపీలోనే కాదు, అసలు భారత దేశంలోనే లేరు. నేరుగా ఫ్లైటెక్కి మాల్దీవ్ లకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో పట్టాభిని లేకుండా ఎందుకు చేశారు. ఆయన్ను ఎందుకు తప్పించారు.

    సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు.. అంటే బోసిడీకే వ్యాఖ్యలు చేశారంటూ పట్టాభిపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఏపీలోని టీడీపీ ఆఫీస్ లపై దాడులు జరిగాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడి చేసి ఆఫీస్ ని ధ్వంసం చేశారు. ఇతర ప్రాంతాల్లో కూడా పార్టీ కార్యాలయాలవద్ద ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.

    మంగళగిరి పార్టీ ఆఫీస్ పై దాడి తర్వాత చంద్రబాబు 36గంటల దీక్ష, దానికి పోటీగా వైసీపీ జనాగ్రహ దీక్ష జరిగాయి.

    ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆ మేరకు రాష్ట్రపతి, ప్రధానికి లేఖాస్త్రాలు సంధించిన చంద్రబాబు.. ఆ తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతిని కలసి నాలుగు విన్నపాలు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టడంతోపాటు, డీజీపీని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యకి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాలనేది చంద్రబాబు ఆలోచన.

    అయితే అసలీ సమస్యకి మూల కారణం అయిన పట్టాభి ఇప్పుడు ఏపీలోనే లేకపోవడం విశేషం. బెయిలుపై విడుదలై బయటకు వచ్చిన పట్టాభి నేరుగా ఫ్లైటెక్కి మాల్దీవ్స్ కి వెళ్లారు. ఈ సమస్యపై చంద్రబాబు ఢిల్లీలో పోరాటం చేస్తుంటే, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని అడుగుతున్న సందర్భంలో పట్టాభిని దేశం ఎందుకు దాటించారు..? అసలు పట్టాభి ఎపిసోడ్ ఏమీ జరగనట్టే చంద్రబాబు ఎందుకు ప్రవర్తిస్తున్నారు.

    పట్టాభి మాట్లాడిన మాటలు ఎక్కడా హైలెట్ కావడంలేదు కానీ, ఆ తర్వాత జరిగిన దాడి, చంద్రబాబు ఢిల్లీ యాత్ర, రాష్ట్రపతిని కలవడం ఇవన్నీ హైలెట్ అవుతున్నాయి. పట్టాభి వ్యాఖ్యలను మరుగునపడేసేందుకే చంద్రబాబు దీక్షలు, ఢిల్లీ పర్యటనలు అంటూ రాజకీయం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తానికి అలా బోసిడీకే రాజకీయం మాల్దీవ్స్ కి వెళ్లిపోయింది, దాని ప్రతిఫలంగా జరిగిన దాడిపై ఢిల్లీలో పోరాటం నడుస్తోంది.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..