బ్లాక్ ఫంగస్ ,బ్లాక్ మార్కెట్ డాక్టర్ల ముఠా

  0
  42

  రెమిడిసెవిర్ ఇంజక్షన్లు, డాక్టర్లే ఓ ముఠాగా ఏర్పడి, వెనకనుంచి కథ నడిపిస్తూ బ్లాక్ మార్కెట్ చేసిన అనేకమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు తాజాగా.. బ్లాక్ ఫంగస్ కి వాడే ఇంజక్షన్ లు కూడా బ్లాక్ లోకి తరలిస్తున్న బ్లాక్ మార్కెట్ డాక్టర్ల ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్ లోని ఈ డాక్టర్ల ముఠా కొంతమందిని అడ్డం పెట్టుకుని, 300రూపాయల విలువ చేసే బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే యాంపోటెరిసిన్-బి ఇంజక్షన్ ను 50వేల రూపాయలకు అమ్మిస్తూ పట్టుబడ్డారు.

  ఈ ముఠాలో డాక్టర్ బి.రామ్ చరణ్, డాక్టర్ గాలి సాయినాథ్, డాక్టర్ చిల్లగొల్ల రవితేజ చౌదరి, మరో ఇద్దరు బ్రోకర్లు ఉన్నారు. వీళ్లు ఈ ఇంజక్షన్లను వివిధ ఆస్పత్రులు, మందుల షాపులనుంచి ప్రిస్క్రిప్షన్ ద్వారా సేకరించి, తమ వద్ద నిల్ ఉంచుకుని ఆస్పత్రుల్లో బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని 300 చేసే ఇంజక్షన్ ను 50వేలకు అమ్ముతున్నారు.

  ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఓ పథకం ప్రకారం వల పన్ని, పట్టుకున్నారు. ముఠాలోని ముగ్గురు డాక్టర్లలో ఇద్దరు పోలీసుల అదుపులో ఉండగా.. మరో డాక్టర్ రవితేజ చౌదరి పరారీలో ఉన్నాడు. అతనికోసం గాలిస్తున్నారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు