పాత మాస్క్ లో బ్లాక్ ఫంగస్ ఉంటుంది.జాగ్రత్త.

  0
  46

  దేశాన్ని కరోనా భయం తర్వాత వణికిస్తున్న బ్లాక్ ఫంగస్ వ్యాధి రోజు రోజుకీ ఎక్కువవుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాధి తీవ్రత పెరిగింది. బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్తులకోసం ప్రత్యేకమైన ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం మెడికల్ ప్రోటోకాల్ కూడా ఆచరణలోకి తెచ్చారు. కరోనా వైరస్ సోకిన సమయంలో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడటం, షుగర్ లెవల్స్ కంట్రోల్ కాకపోవడం, నోటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం తదితర కారణాలతో బ్లాక్ ఫంగస్ సోకుతుంది.

  ఇప్పుడు వాడిన మాస్క్ నే మళ్లీ మళ్లీ దీర్ఘకాలం పాటు వాడటం కూడా బ్లాక్ ఫంగస్ వ్యాధికి కారణం అని వైద్యులు తేల్చారు. చాలామంది మాస్కులు ఉతక్కుండా దాన్నే వేసుకుని తిరుగుతుంటారని, అందువల్ల మాస్క్ లో ఉన్న ఫంగస్ ఏదయినా కరోనా వైరస్ తోపాటు శరీరంలో ప్రవేశించి, బ్లాక్ ఫంగస్ వ్యాధికి కారణం అవుతుందని ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి ఈఎన్టీ డిపార్ట్ మెంట్ చైర్మన్, డాక్టర్ అజయ్ స్వరూప్ చెప్పారు.

  వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లినప్పుడు శరీరంలో మ్యూకస్ స్థాయిలు పెరిగి, ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుందని, ముక్కునుంచి రక్తం కారడం, కళ్లు వాచిపోవడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. ఇలాంటి వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు, తక్షణమే డాక్టర్ల సలహాలు తీసుకోవాలని కూడా అన్నారు.

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు