టీకాలు అక్కర్లేదు.. గోమూత్రం తాగండి..

  0
  42

  బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వార్తల్లోకెక్కారు. గోమూత్రం సేవించండి కరోనా రాదు అంటూ సెలవిచ్చారు. అయితే సదరు ఎంపీగారు గతేడాది కరోనా వస్తే ఢిల్లీ ఎయిమ్స్ లో చేరి చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం బాగున్న తర్వాత గోమూత్రం తాగండి అంటూ జనాలకు ఉచిత సలహా ఇస్తున్నారు. అయితే అది కూడా దేశీయ గోవు మూత్రం తాగితేనే మంచి ఫలితం ఉంటుందని చెప్పారు ప్రగ్యా.

  తాను రోజూ గోమూత్రం తీసుకుంటానని చెబుతున్న ప్రగ్యా, గోమూత్రంతో మరికొన్ని గోపదార్థాలు కలిపి సేవిస్తే తనకు కేన్సర్ తగ్గిందని గతంలో సంచలన ప్రకటన చేశారు. ఆవుపేడ గానీ, గోమూత్రం గానీ కోవిడ్ రాకుండా చేస్తాయని లేదా వచ్చిన తర్వాత నయం చేస్తాయనడానికి శాస్త్రీయమైన ఆధారాలేవీ లేవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అనేకసార్లు ప్రకటించింది. అయినా కూడా బీజేపీ నేతలు ఇలా పదే పదే ప్రకటనలు చేస్తూ విమర్శలకు గురవుతున్నారు.

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.