కోవిద్ హాస్పిటల్ పైకి కారులోనే అటాక్..

  0
  62

  నాసిక్ లోని బిడ్కో కోవిడ్ ఆస్ప‌త్రిలో బీజేపీ నాయ‌కుడు రాజేంద్ర త‌జ‌నే హంగామా సృష్టించారు. తాగిన మైకంలో త‌న ఇన్నోవా కారుతో ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లోకి దూసుకొచ్చాడు. ఆయ‌న తండ్రికి క‌రోనా సోక‌డంతో చికిత్స కోసం బిడ్కో కోవిడ్ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఆయ‌న ప‌దిరోజుల క్రితం చ‌నిపోయారు. ప‌ది రోజుల అనంత‌రం రాజేంద్ర త‌జ‌నే త‌న తండ్రి చావుకి ఆస్ప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని అనుమానంతో, గ‌త‌రాత్రి కారుతో ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లోకి దూసుకొచ్చాడు. అయితే ఆ స‌మ‌యంలో అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ‌న‌ష్టం వాటిల్ల‌లేదు. కాగా అత‌ని భార్య సీమా త‌జ‌నే బీజేపీ కార్పోరేట‌ర్. ఈ ఘ‌ట‌న దృశ్యాల‌న్నీ అక్క‌డే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ‌యింది.

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.