పవన్ – కమలం మంత్రం పారలేదు..

  0
  278

  బీజేపీ-జ‌న‌సేన కూట‌మి ఢమాల్…
  ———–
  తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో బీజేపీ-జ‌న‌సేన కూట‌మి కుదేలైంది. గ‌తంలో కంటే భిన్నంగా ఏమీ లేని ప‌రిస్థితి. హిందుత్వం, మోడీ త‌త్వం, ప‌వ‌న్ మానియా ఇవ‌న్నీ క‌లిపినా.. ముందుకు క‌ద‌ల‌లేని ప‌రిస్థితి. ప‌వ‌న్ చ‌రిష్మా ఓట్ల రూపంలో రాల లేద‌ని అర్ధ‌మైపోయింది. గ‌తంలో ప్ర‌జారాజ్యం తిరుప‌తి పార్ల‌మెంట్ లో 17 శాతం ఓట్లు సాధించింది. ఆ త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల్లో బీఎస్పీ అభ్య‌ర్ధికి జ‌న‌సేన పార్టీ మ‌ద్ద‌తిచ్చింది. 1.60 శాతం ఓట్లు వ‌చ్చాయి. బీజేపీకి కూడా గ‌త తిరుప‌తి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో 1.23 శాతం ఓట్లు వ‌చ్చాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీల‌కు క‌లిపి 5.23 శాతం ఓట్లు వ‌చ్చాయి. అంటే 2.4శాతం ఈ రెండు పార్టీలు క‌లిసి అద‌నంగా ఓట్లు సంపాదించుకున్నాయి. దీన్ని బ‌ట్టి తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌లో బీజేపీ-జ‌న‌సేన పాచిక పార‌లేదు. ఒక‌ప్పుడు తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని అవిచ్చిన్నంగా ద‌క్కించుకున్న కాంగ్రెస్ పార్టీ 1 శాతం కంటే త‌క్కువ ఓట్లే వ‌చ్చాయి. నోటా కంటే సీపీఎం, కాంగ్రెస్ కు త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి.

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.