బైక్ 60 వేలు.ఫైన్ 1 లక్ష 30 వేలు.

  0
  4468

  బైక్ ధర 60 వేలు.. ఫైన్ 1 లక్ష 30 వేలు.. పాపం ప్రకాష్ రాజ్ వాటర్ క్యాన్ లు ఇంటింటికి తిరిగి వేస్తుంటాడు. ఫైనాన్స్ పై బైక్ తీసుకొని ఇంటింటికి వాటర్ క్యాన్ లు వేస్తున్నాడు.వారం క్రితం పోలీసులు పట్టుకొని వరసపెట్టి ఫైన్ మీద ఫైన్ వేసి మొత్తం లక్ష ముప్పై వేలు కట్టమని రశీదు చేతికిచ్చారు. ఆ పేదవాడు నెత్తీ నోరుకొట్టుకుంటున్నాడు.

  బైక్ తీసుకుపోయి పోలీసు స్టేషన్ లో పెట్టేసి , దండంపెట్టి వచ్చాడు..

  ఇంతకీ ఫైన్ వివరాలేమిటో చూడండి. కొత్త బైక్ రిజిస్ట్రేషన్ లేకుండా రోడ్డుమీదకు వచ్చినదానికి 1 లక్ష 17 వేల రూపాయలు ఫైన్ వేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదని 5 వేలు , బైక్ డాక్యుమెంట్లు లేవని 5 వేలు , ఇన్స్యూరెన్స్ కాగితాలు లేవని 3 వేలు … ఇలా చేతిలో పెన్ను , రశీదు పుస్తకం ఉందికదా అని ఎడాపెడా రాసేశారు. ఇప్పుడు వాడేమి చెయ్యాలి..? అందుకే బైక్ తీసుకుపోయి పోలీసు స్టేషన్ లో పెట్టేసి , దండంపెట్టి వచ్చాడు.. ఒరిస్సాలోని లోని , రాయగఢ్ లో జరిగిందిది . కొత్త కేంద్ర చట్టం ప్రకారమే తాము ఈ ఫైన్ వేసినట్టు పోలీసులు చెప్పారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

   

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

   

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..

  https://youtu.be/a6Vner0Vd5c