పవన్ ట్వీట్ వెనక అసలు కారణం అదేనా..?

  0
  529

  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ అభినందనల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తీసుకుంటున్న చర్యలు అందరికీ ఆదర్శప్రాయంగా మారాయని అన్నారు.
  “జనసేన అధ్యక్షుడు
  శ్రీ స్టాలిన్ గారికి శుభాభినందనలు
  ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ – ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం… స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియచేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు.
  పవన్ కళ్యాణ్, అధ్యక్షులు- జనసేన” అంటూ ట్వీట్ చేశారు పవన్.

  అసెంబ్లీలో తనను ఎవరూ పొగడొద్దు అని ఇటీవల ఖరాఖండిగా చెప్పేశారు సీఎం స్టాలిన్. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే బ్యాగుల పై రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలు ఉండగా, అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు. బ్యాగులపై ఫోటోలు మార్చడానికి చాలా ఖర్చు అవుతుందని, అదేదో పేదల అభివృద్ధికి ఆ డబ్బులు ఖర్చు పెడితే వారికి మంచి జరుగుతుందని అన్నారు. దీంతో స్టాలిన్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా జనసేన ట్విట్టర్ అకౌంట్లో స్పెషల్ నోట్ విడుదల చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

  అయితే సడన్ గా పవన్ తన పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ ని ఎందుకు ఉపయోగించారా అనే అనుమానం అందరికీ వచ్చింది. చిరంజీవి పుట్టినరోజుకి కూడా జనసేన ట్విట్టర్ అకౌంట్ నుంచే విషెస్ చెప్పిన పవన్, స్టాలిన్ ని పొగిడేందుకు మాత్రం తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టింగ్ పెట్టారు. ఈమధ్య పవన్ చాలా కాలంగా ట్విట్టర్ కు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన బ్లూ టిక్ ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఎలాగోలా స్టాలిన్ పై ట్వీట్ వేసి తన ట్విట్టర్ అకౌంట్ ని లైవ్ లో ఉంచుకున్నారు పవన్.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్