ప్రకృతి అందమైనదే కాదు, భయంకరమైనది కూడా..

  0
  3634

  ప్రకృతి ఎంత అందమైనదో, అంత భయానకమైనది. వానలు, వరదలు, తుఫానులే కాదు, ఒక్కో దఫా చిన్న కీటకాలు కూడా విలయం సృష్టిస్తాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంలో పొలాలు, రోడ్లు, ఇలా ఎక్కడపట్టినా సాలెగూడులు అల్లుకుని పోయాయి. రెండ్రోజుల్లో కిలోమీటర్ల మేర సాలె పురుగులు గూడులు అల్లేశాయి.

  కాలు పెట్టేందుకు కూడా సందు లేనంతగా చిక్కగా సాలె పురుగులు గూళ్లు అల్లుకున్నాయి. ఉన్నఫళంగా ఇన్ని కోట్ల సాలె పురుగులు ఎలా వచ్చాయో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. పొలాలు, ఇళ్లు, ఇలా అన్ని ప్రాంతాల్లో సాలె పురుగులు గూళ్లు అల్లేశాయి.

  గత నెలలో సౌత్ వేల్స్ లో ఎలుకల విజృంభణ ప్లేగు వ్యాధికి దారితీసింది. ఉన్నఫళంగా అక్కడ ఎలుకలు ఇళ్ల పైకప్పులనుంచి, ఇళ్ల కలుగులలోనుంచి కోట్ల సంఖ్యలో వచ్చేశాయి. దీన్ని ఎదుర్కునేందుకు అత్యవసర పరిస్థితిని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది.

  ఈ ఎలుకల వల్ల దాదాపు 18వేల మంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ వైపరీత్యం ఇలా కొనసాగుతుండగానే ఇప్పుడు విక్టోరియా ప్రాంతంలో విషపు సాలె పురుగులు విస్తరించి గూళ్లు కట్టేస్తున్నాయి. మే నెలలో వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఆ వరదల్లో కొట్టుకొచ్చిన సాలె పురుగులు, ఇతర కీటకాలు ఇప్పుడు విక్టోరియా నగరంలో తిష్టవేసి గూళ్లు కట్టేశాయి.

  ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఇప్పుడీ సాలె పురుగుల నివారణకు మళ్లీ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఇలా ఎందుకు జరిగిందో పరిశీలించాల్సిందిగా ఓ శాస్త్రవేత్తల బృందాన్ని పంపించింది.

  సాలె పురుగులు గూడులు అల్లిన వీడియో, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..