బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోకి వస్తాడా..??

  0
  304

  రాష్ట్రంలో మార్చ్ 10 వతేదీన జరిగే మున్సిపల్ ఎన్నికలకు సినీ హీరో బాలకృష్ణను దించాలని పార్టీలో చర్చమొదలైంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ భావిస్తోంది. పంచాయతీ ఎన్నికలపై టిడిపి నాయకత్వం ఎన్ని భాష్యాలు చెప్పినా , 80 శాతం ఫలితాలు తమకు అనుకూలంగా లేవని వాళ్లకు తెలుసు. పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థయిర్యం , దైర్యం నింపేందుకు చంద్రబాబు నాయుడు ఎన్నిచెప్పినా , ఆయన స్వంత జిల్లాలోనే , వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉండే కుప్పంలో 21 శాతం పంచాయితీలు మాత్రమే గెలవడం బాబుకి మింగుడుపడని పరిస్థితి . బాబుకు గత 30 ఏళ్లుగా ఎదురులేని , తిరుగులేని కుప్పంలోనే చేదు ఫలితాలురావడంతో ఆయన ఆగమేఘాలమీద కుప్పంకు చేరుకొని , సమీక్షిస్తున్నారు. మండలాల్లో ఎర్రటి ఎండలో పర్యటిస్తూ బహిరంగసభల్లో మాట్లాడుతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగనున్నాయి. అందువల్ల ఒకవేళ వ్యతిరేకఫలితాలు వస్తే , ఏవోమాటలు చెప్పి తప్పించుకునే వీలులేదు.

  పంచాయితీ ఎన్నికలు పార్టీ గుర్తులు లేకుండా జరిగేవికాబట్టి , ఫలితాలపై ఎవరికితోచినట్టు వారు చెప్పుకోవచ్చు. అధికారపార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని , అధికారులను పోలీసులను అడ్డంపెట్టుకొని ఫలితాలు తారుమారుచేసిందని , ఇలా ఎన్నైనా ప్రతిపక్షం చెప్పొచ్చు. ఓటమిని సమర్ధించుకోవచ్చు . అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఇది వీలుకాదు. ఈ ఎన్నికల్లో ఫలితాలు సంతృప్తికరంగా లేకపోతే , పార్టీ క్యాడరులో నిరుత్సాహం , నిర్వేదం తలెత్తవచ్చు. పార్టీ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లే అవకాశముంది. గత ఏడాదిన్నరగా జగన్ పై చేస్తున్న పోరాటానికి సంతృప్తికరమైన ఫలితం కనపడకపోతే , లోకేష్ భావి నాయకత్వంపై భ్రమలు తొలగిపోవచ్చు.

  అందువల్ల మున్సిపల్ ఎన్నికల్లో కనీసం కోస్తా , ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధానమైన కార్పొరేషన్లు , మున్సిపాలిటీల్లో బాలకృష్ణ ప్రచార సభలు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినవస్తోంది. అయితే బాలకృష్ణ ఇప్పటిప్పుడు ప్రచారానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అన్నది సందేహమే. ఆయన ఎన్నికల ప్రచారం , తన రాబోయే సినిమామీద ప్రభావం చూపిస్తుందేమోనన్న భయం కూడా ఆయనకు ఉండొచ్చు. రాజకీయాల్లో ఉండే సినీ నటులకుండే లక్షణమే అది.. అయితే పంచాయతీ ఎన్నికలలో ప్రతికూల ప్రభావంనుంచి కొంత మేరకైనా గట్టెక్కాలంటే , మున్సిపల్ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు రావాలన్నది పార్టీ నేతల వాదన. మరో మూడురోజుల్లో బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోకి వస్తాడా ? రాడా ?? అన్నది తేలిపోనుంది..

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?