భాకరాపేట ప్రమాదంలో తిరుపతి ఎస్పీ ఏమిచేశారో తెలిస్తే.. ?

    0
    1967

    పోలీసులంటే , విమర్శలకే కాదు , ప్రశంసలకూ అర్హులే.. చిత్తూరు భాకరాపేటలో ఒక పెళ్లి బృందం బస్సు రాత్రి పదిన్నర ఘాట్ రోడ్డు లోయలో పడ్డ ఘటనలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు స్వయంగా , లోయలో దిగి , సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించాడంటే నమ్మగలరా.. ?? అర్ధరాత్రి , తన సిబ్బందిని , తోడుతీసుకొని లోయలోకి దిగి , క్షతగాత్రులను పైకి మోసుకొచ్చి , అంబులెన్స్ లను పిలిపించి , వేకువనే మూడున్నర వరకు , లోయలోనే ఉండిపోయారు.. ఆ ఆతరువాత రుయా హాస్పిటల్ కి వెళ్లి , పర్యవేక్షించారు..

     

    ఇదేదో పోలీసులు , మీడియా చెప్పేదికాదు.. స్వయంగా క్షతగాత్రులు దండంపెట్టి కన్నీళ్లతో చెప్పకుంటున్న మాటలు.. ప్రమాదం జరిగిన సమయంలో , ఒక యువకుడు బైక్ మీదపోతూ గమనించి , చంద్రగిరి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఈ విషయం ఎస్పీకి చెప్పడంతో , ఆయన వెంటనే అర్ధరాత్రి , అపరాత్రి అనిచూడకుండా , బయలుదేరారు.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి, రిజర్వ్ పోలీసులతో , తానే ముందుగా , ప్రమాదం జరిగిన ప్రాంతానికివెళ్ళాడు.. అంత త్వరగా స్పందించక పోయిఉంటే ,, మరణాలు సంఖ్య మరింతగా పెరిగేది.

     

    ఊరుకాని ఊరులో , లోయలో , ఆడామగా , పిల్లపాపా , గాయాలతో దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేవారు.. అందుకే , ఈ ప్రమాదంలో పోలీసులు , ముఖ్యంగా అర్బన్ ఎస్పీ చొరవను , వృత్తి పట్ల ఆయన అంకిత భావాన్ని , మానవత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాలి..

     

     

    అర్ధరాత్రి లోయలోకి దిగిన ఎస్పీ , 45 మందిని , లోయనుంచి రోడ్డుపైకి పంపిన తరువాతే , తానూ పైకొచ్చారు.. అర్ధరాత్రి , కాళ్ళుచేతులు విరిగిన వారిని , తీవ్ర గాయాలతో ఉన్నవారిని రక్తం కారుతుంటే , వారిని పోలీసులు మోసుకొచ్చి హాస్పిటల్లో చేర్చారు.. అందుకే పోలీసులు , విమర్శలకే కాదు , ఇలాంటివి చూస్తే ప్రశంసలకూ అర్హులని భావించాలి..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..