అతడిపేరు పచ్చబొట్టుగా వేసుకుంది – రేప్ కేసులో ఇరికించింది..

    0
    781

    అక్రమసంబంధం కొనసాగించినంత కాలం సెల్ఫీలు , పార్టీలు , ముద్దులు , మురిపాలు.. వికటిస్తే రేప్ కేసులు .. ఇటీవలకాలంలో కొన్నింటిలో జరిగే తంతు ఇదే.. ఇలాంటిదే ఈ పచ్చబొట్టు అక్రమసంబంధం.. అతడు రేపిస్ట్ అయితే , మూడేళ్ళుగా అతడి పేరు చేతిపై పచ్చబొట్టుగా ఎందుకుంది .. అన్న ప్రశ్నకు సమాధానం లేదు – దీంతో జడ్జి పాపం 8 నెలలుగా జైల్లోఉన్న అతనికి బెయిల్ ఇచ్చేశాడు.

    https://www.hindustantimes.com/india-news/not-easy-to-force-a-tattoo-delhi-hc-grants-bail-to-rape-accused-101613178661661.html

    సంజయ్ అనే వ్యక్తితో ఒక వివాహిత అక్రమసంబంధం పెట్టుకుంది. 2016 నుంచి ఈ సంబంధం గత ఏడాదివరకు కొనసాగింది. యధాప్రకారం ముద్దులతో సెల్ఫీలు , పార్టీలు , పూలదండలు మార్చుకోవడం ..చేతిపై అతడిపేరును పచ్చబొట్టుగా పొడిపించుకోవడం .. తరువాత ఆమె సంజయ్ ని దూరం పెట్టింది. అడిగితే కిడ్నాప్ , రేప్ కేసులు పెట్టింది. పోలీసులు జైల్లో తోశారు. చివరకు సంజయ్ న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసాడు. నాలుగేళ్లు ఇద్దరూ సహజీవనం చేశారని , ఆమె ఇష్టపడే అతడితో ఉండిందని ఆధారాలతో బయటపెట్టారు.

    సంజయ్ పేరుని పచ్చబొట్టుగా తనచేతిపై పొడిపించుకొని , తన ఫేస్ బుక్ , ట్విట్టర్ , అకౌంట్స్ లో అప్ లోడ్ చేసిందని చూపారు. దీంతో జడ్జి రజ్నిష్‌ భట్నాగర్‌ మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం టాటూ వేయడం అనేది ఓ కళ. అందుకు ప్రత్యేకమైన పరికరం కావాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఓ వ్యక్తికి బలవంతంగా టాటూ వేయలేం. పచ్చబొట్టు పొడిపించుకోవడం ఇష్టం లేకపోతే అవతలి వారు దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. కనుక బలవంతంగా టాటూ వేయడం.. ఒకవేళ వేసినా అది పర్ఫెక్ట్‌గా రావడం అనేది జరగదు’’ అని తెలిపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది.

    https://ndnnews.in/whykidnaprape-story-reasonis-1181-2/