ఆటోపైలెట్ కార్లు- మృత్యు వాహనాలేనా..?

    0
    77

    కారు డ్రైవింగ్ వచ్చినా కూడా.. ఆటో పైలట్ మోడ్ ఉంది కదా అని, దాన్ని టెస్ట్ చేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటనలు ఇటీవల వరుసగా జరుగుతున్నాయి. కాలిఫోర్నియాలో తాజాగా జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.

    టెస్లా కంపెనీ కారు ఇటీవలే ఆటో పైలట్ మోడ్ తో కొన్ని మోడళ్లను మార్కెట్ లోకి తెచ్చింది. అందులో చేరాల్సిన గమ్యస్థానం అడ్రస్ అప్ లోడ్ చేసి, మనం రిలాక్స్ గా కూర్చుంచే చాలు, కారు నేరుగా అక్కడికి వెళ్లిపోతుంది. అత్యాధునిక సెన్సార్ వ్యవస్థ ద్వారా.. ముందు, వెనక వస్తున్న వాహనాల మధ్యలో టెస్లా కారు దూసుకెళ్తుంది. అయితే ఆటో పైలడ్ మోడ్ లో పెట్టినా కూడా డ్రైవర్ స్టీరింగ్ పై ఓకన్నేసి ఉంచడం మంచిది.

    లాస్ ఏంజిలస్ హైవేలో ఇటీవల వరుసగా ఆటో పైలట్ మోడ్ వల్లే 29 కారు ప్రమాదాలు జరిగాయని అధికారులంటున్నారు. తాజాగా ఓ డ్రైవర్ కారు ఫీచర్స్ ని వివరిస్తూ ఆటో పైలట్ మోడ్ పెట్టి, టిక్ టాక్ వీడియో చేస్తున్నాడు. వీడియో చేస్తూనే అతను ప్రమాదానికి గురై చనిపోయాడు.

     

    వరుస ప్రమాదాలతో టెస్లా కంపెనీ ఆటో పైలట్ కార్లపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఆటో పైలడ్ మోడ్ ఉన్నా కూడా, డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలని, కంపెనీ సూచిస్తున్నా కూడా వినియోగదారులు చేస్తున్న తప్పుల వల్ల ప్రమాదాలు మాత్రం ఆగడంలేదు.

     

    వీ చదవండి

    టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

    10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

    ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

    విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.