జనస్పందనలో అమ్మాయిలకోసం అర్జీలు

  0
  6207

  అమ్మాయిలు కావాలి, అమ్మాయిలుంటే మాకు చూపించండి పెళ్లి చేసుకుంటాం, లేదంటే కనీసం ప్రభుత్వానికి చెప్పి మాకు పెళ్లిళ్లు అయ్యేలా చూడండి అంటూ కర్నాటకలోని తుముకూరులో లేడీ తహశీల్దార్ తేజశ్వినికి అర్జీలు పెట్టుకున్నారు అక్కడి యువకులు. దీంతో ఆమె షాకయ్యారు. వారి అర్జీలు తీసుకుని అక్కడినుంచి పంపించేశారు.
  అసలేం జరిగిందంటే..?
  తుముకూరులో లేడీ తహశీల్దార్ తేజశ్విని జన స్పందన పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ఆమె అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. దీంతో తుముకూరులోని కుర్రోళ్లంతా అర్జీలు పట్టుకుని వచ్చారు. అందరిదీ ఒకటే అభ్యర్థన. తమకు పెళ్లి కాలేదు, తమ ఊరివారికి ఎవరూ పిల్లనివ్వడంలేదు, తమకి పెళ్లి చేసే బాధ్యత తీసుకోండి అంటూ అభ్యర్థించారు. తుముకూరులో చాలామంది యువకులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు బట్టల పరిశ్రమలో పనిచేస్తున్నారు. కానీ ఆ ఊరి అమ్మాయిలు, చుట్టుపక్కల ఊళ్ల అమ్మాయిల తల్లిదండ్రులు మాత్రం సాఫ్ట్ వేర్ అబ్బాయిలనే కోరుకుంటున్నారు. పెళ్లి కోసం తామెక్కడ వ్యవసాయం మానేయాలని అడుగుతున్నారు కుర్రోళ్లంతా. తాము వ్యవసాయం మానేయలేమని, తమకి పిల్లని చూసే బాధ్యత తహశీల్దార్ తీసుకోవాలని కోరారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..