ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

  0
  37

  కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు అండగా నిలిచిన ప్రభుత్వం, దాని కొనసాగింపుగా వస్తున్న బ్లాక్ ఫంగస్ ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. కరోనా తగ్గిన తర్వాత చాలామందిని బ్లాక్ ఫంగస్ ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఏపీలో కూడా ఇదే తరహా కేసులు బయటపడుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఔషధాలకు కొరత వచ్చిందని, వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగాయనే వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  తెలంగాణలో ఇబ్బందులు..
  అటు తెలంగాణలో మాత్రం కరోనా వైద్యాన్ని కూడా ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చలేదు. ప్రతిపక్షాలనుంచి ఒత్తిడి ఎదురవుతున్నాకూడా ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ చికిత్స ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడంతో తెలంగాణ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగినట్టయింది.

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.