భారత్ లో మరో వ్యాక్సిన్..

  0
  69

  భారత్ లో మరో వ్యాక్సిన్..
  స్పుత్నిక్ -వి టీకాకి అత్యవసర అనుమతి

  ప్రపంచ మార్కెట్లో చాలా రకాల వ్యాక్సిన్ లు అందుబాటులో ఉన్నా కూడా.. భారత్ లో మాత్రం కొవాక్సిన్, కొవిషీల్డ్ లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు స్పుత్నిక్-వి అనే టీకా కూడా వస్తోంది. స్పుత్నిక్-వి టీకా అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. కొత్తగా మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించగా.. ఇందులో తొలిగా రష్యా అభివృద్ధి చేసిన చేసిన ‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి కోసం కేంద్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. త్వరలోనే టీకా ఉత్పత్తి చేసి, వినియోగంలోకి తీసుకురాబోతున్నారు. డీజీసీఐ అనుమతి లభిస్తే ఇది మార్కెట్ లోకి వస్తుంది.

  రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసి, విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. స్పుత్నిక్‌-వి టీకాపై మనదేశంలో రెండు, మూడో దశ క్లినికల్‌ పరీక్షలను ఇటీవలే ఆ సంస్థ నిర్వహించింది.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ