కరోనా పేరుతొ అంబులెన్స్ ల దోపిడీ..

  0
  545

  కరోనా కల్లోలంలో దేశం కకావికలం అవుతుంది. ప్రాణవాయువుకోసం ఆర్తనాదాలు , బెడ్లు దొరక్క రోడ్లమీదనే మరణాలు , కలియుగంలో అతిపెద్ద దారుణమారణహోమాన్ని దేశం ఎదుర్కొంటుంది. దీనంగా తయారైన దేశం పరిస్థితి చూసి ప్రపంచదేశాలు సాయం అందిస్తున్నా , అదుపుతప్పిన పరిస్థితిలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నటూ బతుకుతున్నారు. పనిలోపనిగా ఈ మహా విలయాన్ని అడ్డంపెట్టుకొని ఎవడికి అందినంత వాడు దోచుకుంటున్నాడు. ఆసుపత్రి ఫీజులు , బ్లాక్ మార్కెట్లో మందులు , ఇంజెక్షన్లు , ఆక్సిజన్ సిలిండర్లు ..ఇలా అందినంత దోచేస్తున్నారు.. ఆస్తులు , ప్రాణాలు పోగోట్టుకొని జనం అల్లాడిపోతున్నారు. అంబులెన్స్ చార్జీలపేరుతో దోపిడీకూడా ఎక్కువైంది. ఢిల్లీలో 4 కిలోమీటర్ల దూరానికి 10 వేలు సంఘటనే కాదు ఇప్పుడు 358 కిలోమీటర్ల దూరానికి 1 లక్ష , 20 వేలరూపాయలు అంబులెన్స్ చార్జీ వసూలు చేశారు. గురుగావ్ నుంచి లూధియానాకు ఒక పేషేంట్ ను తీసుకురావడానికి ఇంత డబ్బు గుంజారు. ఐపీఎస్ అధికారి పంకజ్ నయన్ ఆ బిల్లుని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు..

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.