అల్లూరి గెటప్ లో ఎవరు అదుర్స్….?

  0
  543

  అల్లూరి సీతారామరాజు. ఆ పేరు వినగానే సినీ ప్రియులందరికీ గుర్తొచ్చేది పేరు సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ తీసిన అల్లూరి సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. ఆ తర్వాత రామారావు కొన్ని సందర్భాల్లో అల్లూరి గెటప్ లో కనిపించినా కృష్ణను మరిపించలేకపోయారు. బాలకృష్ణ సహా మరికొందరు కూడా అల్లూరి పాత్రల్లో అలా కనిపించి ఇలా మాయమయ్యారు కానీ, పూర్తి స్థాయిలో మణ్యంవీరుడిగా కనిపించే సాహసం ఎవరూ చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నాడు. మణ్యం వీరుడి పాత్రలో చరణ్ ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది.

  రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే సోషల్ మీడియాలో అప్పుడే పోలిక మొదలైంది. సీతారామరాజుగా కృష్ణ బాగున్నాడా, చరణ్ బాగున్నాడా అంటూ పోల్స్ పెడుతున్నారు.

  ఇవీ చదవండి

  బట్టనెత్తి కనపడితే ఇంత గొడవా – భలే భలే

  పార్కుల్లో ప్రేమ జంటలే వాడి టార్గెట్.

  నగ్నంగా పోజులిస్తారు- బెడిసికొడితే??

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..