అజిత్ కి కోపమొచ్చింది.. అభిమాని ఫోన్ పోయింది..

  0
  938

  తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయాన్నే బయటకు వచ్చారు హీరో అజిత్. భార్య షాలినితో కలసి ఆయన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అజిత్ ని చూసేందుకు అక్కడ ఉన్న వారంతా గుమికూడారు. పోలీసులు సర్ది చెబుతున్నా వినకుండా అజిత్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి, మరీ దగ్గరకు రావడానికి ప్రయత్నించారు. సహజంగా అజిత్ అభిమానులతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించరు. కానీ పక్కనే భార్య ఉన్నా కూడా అభిమానులంతా అలా గుమికూడటంతో ఆయనకు కోపం వచ్చింది. ఆ అభిమానిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు, అభిమాని చేతిలోని సెల్ ఫోన్ లాక్కున్నాడు. దాన్ని తన భద్రతా సిబ్బందికి ఇచ్చేశాడు. అజిత్ ప్రవర్తన చూసి అభిమానులు కూడా షాకయ్యారు.

  ఇవీ చదవండి

  వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

  ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

  కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ