మీడియా టైగర్లతో లోకేష్ పార్టీని నడపగలడా?

    0
    219

    మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి ఊహించ‌ని ప‌రాజ‌యం ఎదురు కావ‌డంతో ఇప్పుడు నాయ‌క‌త్వ‌మే స‌మ‌స్య‌లో ప‌డింది. సాధార‌ణంగా అధికారంలో ఉన్న పార్టీకి ఎంతోకొంత వ్య‌తిరేక‌త ఉండి తీరుతుంది. అయితే 20 నెల‌ల జ‌గ‌న్ ప‌రిపాల‌న‌లో అదేమీ క‌న‌ప‌డ‌క‌పోగా, రివ‌ర్స్ గేర్ లో తెలుగుదేశం పార్టీ సైకిల్ తునాతున‌కలు కావ‌డం గ‌మ‌నించ‌ద‌గిన అంశం. స్థానిక ఎన్నిక‌ల్లో ఇంత ఘోర ప‌రాజ‌యం దేశంలో ఏ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీకి ప్రాప్తించ‌లేదు.

    లోకేష్ ప‌నితీరు మెరుగు ప‌డింద‌న్న మాట వాస్త‌వం.

    ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందున్న స‌మ‌స్య‌, లోకేష్ నాయ‌క‌త్వం. రాజ‌కీయంగా ఎవ‌రెన్ని చెప్పినా, చంద్ర‌బాబు నాయుడు త‌న కొడుకు లోకేష్ ను త‌న వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చేశారు. పార్టీలో సీనియ‌ర్లు కూడా లోకేష్ కు అణిగిమ‌ణిగి ఉండ‌వ‌ల‌సిన ప‌రిస్థితి తెచ్చారు. రాజ‌కీయ ప్రారంభ ద‌శ‌లో లోకేష్ ఉప‌న్యాసాల్లోనూ, రాజ‌కీయ వ్య‌వ‌హారాలు నిర్వ‌హించ‌డంలోనూ కొన్ని లోటుపాట్లు జ‌రిగినా, ఇటీవ‌ల కాలంలో లోకేష్ ప‌నితీరు మెరుగు ప‌డింద‌న్న మాట వాస్త‌వం. ఉప‌న్యాసాల్లో ప‌రిప‌క్వ‌త క‌న‌బ‌డుతుంది. పోరాట స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. అధికార‌ప‌క్షంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. గ‌తంలో కంటే ఇప్పుడు బాగా తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఎక్క‌డ స‌మ‌స్య వ‌చ్చినా అక్క‌డికి వెళ్తున్నాడు.

    ప్ర‌జ‌లు లోకేష్ ను న‌మ్మ‌డం లేద‌ని తేలిపోయింది.

    గ‌త 20నెల‌ల్లో చంద్ర‌బాబు నాయుడు లోకేష్ ను ప్ర‌జ‌ల్లోకి వ‌దిలి అత‌డి నాయ‌క‌త్వానికి ప‌దును పెట్టాడు. అయితే ఎన్నిక‌ల్లో ఫ‌లితాల‌పై లోకేష్ నాయ‌క‌త్వ ప్ర‌భావం ఏమీ లేద‌ని తెలిసిపోయింది. ప్ర‌జ‌లు లోకేష్ ను న‌మ్మ‌డం లేద‌ని తేలిపోయింది. లోకేష్ నాయ‌క‌త్వం టీడీపీ అనుకూల మీడియాకు, సోష‌ల్ మీడియాకే ప‌రిమిత‌మైపోయింద‌ని స్ప‌ష్ట‌మైపోయింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌ధ‌కాలనే ప్ర‌జ‌లు విశ్వ‌సించార‌ని, వాటికే ప‌ట్టం క‌ట్టార‌ని స్ప‌ష్ట‌మైపోయింది. గ‌త కొంత‌కాలంగా రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌త ప్ర‌స్తావ‌న‌, దేవాల‌యాల్లో విగ్ర‌హాల విధ్వంసం, అమ‌రావ‌తి ఉద్య‌మం, విశాఖ ఉక్కు స‌మ‌స్య… ఇవేవీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఓటింగ్ లో ప‌ని చేయ‌లేద‌ని స్ప‌ష్ట‌మైంది. చంద్ర‌బాబు మాట‌ల‌ను గానీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శ‌ల‌ను గానీ, లోకేష్ ప్ర‌చారాస్త్రాల‌ను గానీ … జ‌నం ప‌ట్టించుకోలేద‌ని నిరూపింత‌మైంది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీలో ఓల్డ్ క‌మాండ‌ర్స్ ఇక రాజ‌కీయాల‌కు ప‌నికిరార‌ని అర్ధ‌మైపోయింది. య‌న‌మల రామ‌కృష్ణుడు, అయ్య‌న్న‌పాత్రుడు, బుచ్చ‌య్య చౌద‌రి, ప‌త్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి వంటి నాయ‌కులకు కాలం తీరిపోయింద‌ని తేట‌తెల్ల‌మ‌వుతోంది. ఈ ప‌రిస్థితుల్లో లోకేష్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి, పార్టీని ముందుకు తీసుకెళ్తాడ‌న్న న‌మ్మ‌కం కూడా సాధార‌ణ కార్య‌క‌ర్త‌ల్లో క‌ల‌గ‌డం క‌ష్టం. భవిష్య‌త్తులో జ‌గ‌న్ స్వ‌యంకృతాప‌రాధాల‌తో త‌ప్పులు చేస్తే త‌ప్ప‌, తెలుగుదేశం పార్టీ సైకిల్ ముందుకు వెళ్ళే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల జ‌రిగిన‌ ఎన్నిక‌ల ఫ‌లితాలే ఇందుకు నిద‌ర్శ‌నం.

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??