మార్కెట్ లో గంటకు మించి ఉంటే 500 ఫైన్ .

  0
  231

  మ‌హారాష్ట్రంలో రోజురోజుకీ పెరిగిపోతున్న క‌రోనాను ఎలా అరిక‌ట్టాలో తెలియ‌క‌, షాపులు మూయ‌లేక‌, నాసిక్ అధికారులు కొత్త ర‌కం ఆలోచ‌న చేశారు. కూర‌గాయ‌ల‌ మార్కెట్లోగానీ, పండ్ల మార్కెట్లోగానీ, చిల్ల‌ర దుకాణాల మార్కెట్లోకి ప్ర‌వేశించాల‌న్న ఐదు రూపాయ‌ల టిక్కెట్ కొనుక్కోవాలి. టిక్కెట్ లేక‌పోతే లోనికి పంప‌రు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా మార్కెట్లో గంట‌కి మించి ఉంటే 500 రూపాయ‌ల ఫైన్ చెల్లించాలి. మార్కెట్లోకి వెళ్ళే టైం, బ‌య‌ట‌కి వ‌చ్చే టైం రెండూ రికార్డ్ చేస్తారు. బ‌య‌టికి వ‌చ్చే స‌మ‌యం 5 నిమిషాలు దాటినా 500 రూపాయ‌లు ఖ‌చ్చితంగా ఫైన్ కట్టాల్సిందే. మార్కెట్లో ర‌ద్దీ త‌గ్గించేందుకు, క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఇలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని నాసిక్ పోలీస్ క‌మిష‌న‌ర్ చెబుతున్నారు. పెళ్ళిళ్ళు, ఇత‌ర ఫంక్ష‌న్ల‌లో అనుమ‌తించిన దానికంటే ఎక్కువ మంది ఉంటే ల‌క్ష రూపాయ‌ల ఫైన్ విధిస్తారు. మాస్క్ లేక‌పోయినా ఆ ఫంక్ష‌న్ లోనే ఫైన్ వేసి వ‌సూలు చేస్తారు.

   

  https://ndnnews.in/supermoon-helped-ship-to-float/

  https://ndnnews.in/ram-charan-reaction-on-vakeel-saab-trailer/

  https://ndnnews.in/2bride-elopes-cheating-on-5-grooms/

   

  https://youtu.be/eZMv2ZOmhLk