తాగుబోతును మ‌హిళా టీచ‌ర్లు కొట్టి చంపేశారు.

  0
  304

  త‌మ‌పై అత్యాచారానికి ప్ర‌య‌త్నించిన ఓ తాగుబోతును ఇద్ద‌రు మ‌హిళా టీచ‌ర్లు కొట్టి చంపేశారు. ఈ టీచ‌ర్లు ఇద్ద‌రూ అక్బ‌రాబాద్ లో ఓ ప్రైవేట్ స్కూల్లో ప‌ని చేస్తున్నారు. అక్క‌డే ఉన్న హాస్ట‌ల్ లో ఉంటున్నారు. జితేంద్ర కుమార్ అనే 30 ఏళ్ళ యువ‌కుడు గ‌త కొంత‌కాలంగా ఈ టీచ‌ర్ల‌ను వేధిస్తున్నాడు.

  రెండు రోజుల క్రితం తాగిన మైకంలో స్కూల్ ప్రాంగ‌ణంలోకి ప్ర‌వేశించి, హాస్ట‌ల్ లోకి వెళ్ళి… వారిపై అత్యాచారం చేసేందుకు ప్ర‌య‌త్నించాడు. దీంతో ఆ టీచ‌ర్లు ఇద్ద‌రూ వాడిని ప‌ట్టుకుని చ‌చ్చే దాకా క‌ర్ర‌ల‌తో కొట్టారు. స్కూల్ ప‌క్క‌నే నివాసం ఉండే ఇత‌నిని కొడుతున్నార‌ని తెలిసి, అత‌ని బంధువులు స్కూల్ వ‌ద్ద‌కు చేరుకుని, కొట్టొద్ద‌ని వారిస్తున్నా… అవేవీ ప‌ట్టించుకోకుండా చ‌చ్చే వర‌కు కొట్టారు. బైక్ లో వెళుతున్న త‌న త‌ల్లిని ఆస్ప‌త్రికి వెళుతున్న అత‌నిని ఆపి.. ఈ టీచ‌ర్లు లాక్కెళ్ళి కొట్టి చంపేశార‌ని మృతుని బంధువులు ఆరోపించారు.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..