భర్త ఉరేసుకుంటే సెల్ఫీ తీసిన భార్య..

  0
  8731

  భర్త ఆత్మహత్యను ఆనందంగా వీడియో తీసిన ఓ నీచురాలైన ఓ భార్య ఉదంతమిది. అయిదేళ్ల ప్రేమ తర్వాత, నాలుగు నెలల క్రితమే.. అమోన్ షా అనే యువకుడు నేహా శుక్లా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. గత డిసెంబర్ 11 వ తేదీన వీరిద్దరి పెళ్లి జరిగింది. పెళ్ళైన రెండు నెలలకే నేహా.. మరో యువకుడితో చాటింగ్ మొదలు పెట్టింది. పెళ్ళైన తర్వాత భార్యా భర్తలిద్దరూ.. ఇంతకు ముందు తాము చేస్తున్న ఉద్యోగాలను వదలిపెట్టి.. వ్యాపారాలను చేయాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా భార్య నేహా పక్కదారి పడుతుందని గ్రహించిన అమోన్, ఆమెను మందలించాడు. దీంతో నేహా.. తనకు విడాకులిచ్చేయమని.. అమోన్ పై ఒత్తిడి తెచ్చింది.

  అయితే అమోన్ మాత్రం భార్యకు విడాకులిచ్చేందుకు ఒప్పుకోలేదు. ఐదేళ్ల ప్రేమను చంపుకోవద్దని ఆమెను బ్రతిమలాడాడు. అయినా నేహా, విడాకుల కోసం ఒత్తిడి చేసింది. దీంతో విరక్తి చెందిన అమోన్ తాను ఆత్మహత్య చేసుకుంటానని భార్యను బెదిరించాడు. తనగదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. భర్త ఉరేసుకుని చనిపోవడాన్ని.. నేహా వీడియో కూడా తీసింది. నువ్వు చనిపోతే చూడాలని ఉందంటూ ఆమె చెబుతున్న మాటలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తన భర్త ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదని.. కేవలం బెదిరిస్తున్నాడని అనుకున్నానని ఆమె పోలీసు విచారణలో తెలిపింది. ఈ దారుణం కలకత్తాలో జరిగింది.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.