ఆకాశంలో రెండు విమానాలు ఢీ…

  0
  36

  ఆకాశంలో రెండు విమానాలు ఢీకొంటే ఏమవుతుంది..?
  దీనికి సందేహం అనవసరం.. ఎందుకంటే రెండు విమానాలు బూడిదైపోవాల్సిందే.. అయితే అమెరికాలోని కొలరాడోలో ఆకాశమార్గంలో రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయి. విచిత్రంగా రెండు విమానాల్లోని పైలట్లు ఎటువంటి గాయాల్లేకుండా బయటపడ్డారు.

  ఒకవిమానం మధ్యలో రెండుగా విడిపోయి..కొద్దిభాగమే మిగిలింది. రెండవ విమానం ముందుభాగం మాత్రమే దెబ్బతింది. కొలరాడోలోని డెన్వర్ శివారులోని ఎయిర్ పోర్టులో దిగేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు విమానాలు ఢీకొన్న సమయంలో ఒక విమానంలోని పైలట్ పారాచూట్ సాయంతో కిందకు దిగేయగా.. మరో విమానాన్ని పైలట్ చాకచక్యంగా లాండింగ్ చేశాడు. ఆకాశంలో రెండు విమానాలు ఢీకొని.. ఇలా అందరూ క్షేమంగా బయటపడిన సంఘటన అత్యంత అరుదుగా జరుగుతుంది.

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.