తల్లి ఊపిరినిలిపేందుకు కూతుళ్ళ ఆరాటం చూడండి.

  0
  2714

  తల్లి ఊపిరినిలిపేందుకు కూతుళ్ళ ఆరాటం చూడండి.. ఇదో కన్నీటి వ్యధ . ఈ యుగంలో మనం చూస్తున్న కరోనా మహావిలయం.. ఉత్తరప్రదేశ్ లోని బైరోచి జిల్లా ఆసుపత్రిలో రాతి గుండెల్ని సైతం కరిగించే దృశ్యం.. తల్లికి కరోనా సోకడంతో , ఆమె ఊపిరితీసుకోలేక పోయింది. ఆసుపత్రికి తీసుకొస్తే ఆక్సిజన్ లేదన్నారు. మూడు నాలుగు గంటలు చూస్తేగానీ వస్తుందో రాదో తెలియదన్నారు. ఈ లోగా కూతుళ్లు ఒకరుమార్చి మరొకరు తల్లి కి తమ నోటిద్వారా ప్రాణవాయువు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దృశ్యం చూసిన డాక్టర్లు కూడా కంటతడిపెట్టడం మినహా ఏమీ చేయలేకపోయారు.. పరిస్థితి చేయిదాటిపోయేవరకు చేష్టలుడిగిన నేతలను మనం ఏమీ చేయలేం
  కదా ?? ఇదే రాష్ట్రంలో ఓ భార్య ఆక్సిజన్ అందని తన భర్త చనిపోయాడని తెలియక , ఆటోలోనే నోటితో శ్వాస అందించిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది.. ఇప్పుడు అలాంటి దయనీయ చావు బ్రతుకుల చిత్రమే ఇది..

   

   

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.