ట్రాఫిక్ పోలీసు వేసిన ఫైన్ కు తాళిబొట్టు తీసి ఇచ్చేసింది.

  0
  1087

  బైక్ మీద భార్యతో పోతున్న వ్యక్తికి హెల్మెట్ లేదని ట్రాఫిక్ పోలీస్ ఆపింది.. ఫైన్ వేస్తామని చెప్పారు. సరేనన్నాడు. తీరా ట్రాఫిక్ పోలీసు ఇచ్చిన చలానా చూసి భర్త వణికిపోయాడు. భార్యమాత్రం కూల్ గా , తాళిబొట్టుతీసి ట్రాఫిక్ పోలీసు చేతిలోపెట్టి దీన్ని అమ్ముకొని జమ వేసుకోండి అని చెప్పింది. షాక్ తిన్న పోలీసు , కాసేపటికి తేరుకొని తాళిబొట్టు మాకెందుకు ఫైన్ కట్టిపొమ్మన్నాడు. ఇంతకీ అతను హెల్మెట్ లేని నేరానికి వేసిన ఫైన్ 11 వేలరూపాయలు.. అదీసంగతి. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగింది. హుక్కేరి తాలూకా హుల్లోళిహట్టి గ్రామానికి చెందిన భారతి అనే మహిళ పోలీసుల అమానవీయతపై ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.

  భారతి తన భర్తతో కలసి బైక్‌పై బెళగావి మార్కెట్‌కు వచ్చింది. తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో బస్టాండ్‌ వద్ద హెల్మెట్‌ లేదని పోలీసులు బైక్‌ను నిలిపేశారు. డాక్యుమెంట్లు పరిశీలించకుండానే నేరుగా జరిమానా విధిస్తూ రసీదు చేతికందించారు. అసలే మార్కెట్‌కు వెళ్లి డబ్బులు ఖాళీ చేసుకుని వెళుతున్న ఈ దంపతుల వద్ద కేవలం రూ.100 మాత్రమే ఉంది. జరిమానా కింద ఈ రూ.100 తీసుకుని వదిలేయండి అంటూ దంపతులు ప్రాధేయపడ్డారు.

  అయితే ఏమాత్రం కనికరించని పోలీసులు ఫైన్‌ కట్టి వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసుల తీరుకు విసిగిపోయిన మహిళ తన మెడలో ఉన్న బంగారు తాళిని తీసి భర్త చేతికిచ్చి ఇది తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురండి అని చెప్పింది. చివరికి అక్కడికి చేరుకున్న సీనియర్‌ పోలీసు ఉన్నతాధికారులు విషయం తెలుసుకుని దంపతులను వదిలేశారు.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?