లాక్ డౌన్ లో బరువు పెరిగారు.ఉద్యోగాలు పోయాయి.

  0
  744

  పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇటీవల 140మందిని ఉద్యోగాల్లోనుంచి తీసేసింది. కారణం వారు అధిక బరువు ఉండటమే. అయితే ఇప్పుడీ విషయం సంచలనంగా మారింది. కేవలం బరువు పెరిగారన్న కారణంతో వారిని ఉద్యోగాలనుంచి తొలగించడం సరికాదనేది కొంతమంది వాదన. అయితే తాము ఉద్యోగాల్లోకి తీసుకునేటప్పుడే ఆ నిబంధన పెట్టామని, ఇప్పుడు బరువు పెరిగినందువల్లే వారు ఉద్యోగాలు కోల్పోయారని పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ సంస్థ స్పష్టం చేసింది.


  లాక్ డౌన్ లో బరువు పెరిగాం.. ఛాన్స్ ఇవ్వండి తగ్గి చూపిస్తాం..
  కొన్ని ఉద్యోగాల‌కు బొద్దుగా ఉంటే పనికిరారు. నాజూగ్గా, ఫిట్ గా ఉన్న‌వారికే ఆ ఉద్యోగాల్లోకి అనుమ‌తి ఉంటుంది. ఒక‌వేళ ఉద్యోగం చేస్తున్న స‌మ‌యంలో లావుగా మారితే, తొల‌గించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ముఖ్యంగా ఎయిర్‌లైన్స్ ఉద్యోగాలు చేసే వారు త‌ప్ప‌నిస‌రిగా నాజూగ్గా క‌నిపించాలి. లేదంటే వేటు త‌ప్ప‌దు. లావుగా ఉన్నారని పాకిస్తాన్ ఎయిర్‌ లైన్స్ సంస్థ 140 మందిని విధుల నుంచి తొల‌గించింది.

  ప‌లుమార్లు వారికి నోటీసులు ఇచ్చామ‌ని, అధిక బ‌రువు త‌గ్గించుకోవాల‌ని చెప్పినా విన‌క‌పోవ‌డంతో వారి పేర్ల‌ను జులై నెల‌కు సంబందించి ఫ్లైట్ డ్యూటి రోస్ట‌ర్ లిస్ట్ నుంచి తొల‌గించింది. దీంతో 140 మంది సిబ్బంది పాక్ ఎయిర్‌ లైన్ తీరుపై మండిప‌డుతున్నారు. లాక్ డౌన్ వల్ల బరువు పెరిగామని, తగ్గడానికి తమకు కొంత సమయం కావాలని వారు కోరుతున్నారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.