ఆక్సిజన్ లీక్.22 మంది కరోనా రోగుల మృతి.

  0
  4168

  ఆక్సిజన్ ట్యాంకర్ లీక్..
  22 మంది కరోనా రోగుల మృతి..
  ======================
  నాసిక్ లోని ఒక ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. కోవిడ్ పేషెంట్ల కోసం కేటాయించిన ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ లీకైంది. దీంతో ఆక్సిజన్ సరఫరా ఆధారంగా ఉన్న 22 మంది రోగులు చనిపోయారు. ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజీని ఆసుపత్రి అధికారులు గుర్తించలేదు. కరోనా రోగులు ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న సమయంలో, బయట ఆక్సిజన్ ట్యాంకర్లో ప్రాణ వాయువును నింపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ట్యాంకర్ లో ఆక్సిజన్ లీకైంది. ఒక్కసారిగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. వెంటిలేటర్ పై ఆసమయానికి 150 మంది రోగులున్నారు. ఆక్సిజన్ అందకపోవడంతో 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటికి గానీ అధికారులకు విషయం తెలియలేదు. ఆ తరువాత విషయం తెలుసుకున్న వైద్యులు.. ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించారు.

   

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.