మాస్క్ పెట్టుకోలేదని 10 వేల రూపాయలు ఫైన్..

  0
  635

  మాస్క్ పెట్టుకోకపోతే 70 రూపాయలు, లేదా 100 రూపాయలు, మహా అయితే 500 ఫైన్ వేయడం మామూలే.. అయితే యూపీలోని థియోరియాలో మాస్క్ పెట్టుకోలేదని ఒక వ్యక్తికి ఏకంగా 10 వేల రూపాయలు ఫైన్ వేశారు. అమర్జీత్ యాదవ్ అనే వ్యక్తి ఏప్రిల్ 18వ తేదీన మాస్క్ లేకుండా కనిపిస్తే.. పోలీసులు 1000 రూపాయలు ఫైన్ వేశారు. మళ్ళీ అదే వ్యక్తి సోమవారం నాడు రెండవ సారి కూడా మాస్క్ లేకుండా కనిపించాడు. మొదటిసారి ఫైన్ వేసినప్పుడు పోలీసులు మాస్క్ కూడా ఫ్రీగానే ఇచ్చారు. రెండవ సారి మాస్క్ లేదని పోలీసులు ప్రశ్నిస్తే.. మళ్ళీ ఫ్రీగా మాస్క్ ఇవ్వాలని అడిగాడు. దీంతో ఒళ్ళుమండిన పోలీసులు.. 10 వేలు ఫైన్ వేశారు. ఈసారి మాస్క్ లేకుండా కనిపిస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

   

  ఇవీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.