ఆనందయ్య మందు వెనుక అసలు నిజం..

  0
  37

  ఆనందయ్య మందు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారులేరు.. భారతదేశంలోనే మూడురోజుల్లో ఈ మందు పేరు మార్మోగిపోయింది.. కరోనా నివారణకు అవసరమైన వ్యాధినిరోధక శక్తిని ఇది పెంపొందిస్తుందని నమ్మకం.. కరోనా పాజిటివ్ రోగులకూ ఇది పనిచేసిందని వాడిన వారు చెబుతున్నమాట.. శరీరంలో ఆక్సిజెన్ శాతం పెంచిందని వాడేవాళ్లు చెప్పిన అనుభవం.. శాస్త్రీయపరమైన విశ్లేషణ సంగతి పక్కనపెడితే , ప్రజలు దీన్ని నమ్మారు.. కరోనా పేరుతొ కార్పొరేట్ ఆసుపత్రుల్లో దోపిడీ , జబ్బు నయంకాని పరిస్థితులు , చావులు , ఒకే కుటుంబంలో వరుస మరణాలు .. ఆదుకోలేని వైద్య పరిజ్ఞానం..అందుబాటులోలేని ప్రాణవాయువు, బ్లాక్ మార్కెట్ లో మందులు .. ఇలా ఎన్నో కారణాలు.. మూడు రోజుల్లో ఆనందయ్యను కరోనా వ్యాధిగ్రస్తులకు ఆశాకిరణంగా మార్చాయి..

  మందుపై జనంలో ఉన్న ఉత్సాహం ,ఆత్రుత తొక్కిసలాటకు కారణమై మందు శాస్త్రీయతవైపు దృష్టి మళ్లించాయి.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కదిలింది.. సంబంధిత శాఖలను మోహరించి నివేదికలను కోరాయి.. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ సీసీఆర్‌ఏఎస్‌ ఆనందయ్య మందును విశ్లేషించే పని మొదలు పెట్టింది.ఆయుష్ శాఖ ఇప్పటికే ఈ మందుకు ప్రాధమికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ సర్వేలో భాగంగా మందు వాడిన వారి అభిప్రాయాలను రెండు రోజుల్లో సేకరిస్తారు.. ఇప్పటికే మందు తీసుకున్న వారిన ఫోన్‌ నంబర్లను పోలీసుల సేకరించిన నేపథ్యంలో విజయవాడ ప్రాంతీయ పరిశోధన స్థానం, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి వైద్యులు మందు తీసుకున్న 500 మందికి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోనున్నారు. మందు తయారీకి అభ్యంతరంలేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కూడా ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మందు తయారీకి ఏర్పాట్లు చేస్తుందని చెబుతున్నారు.. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు..

  ఇవీ చదవండి..

  ఏపీని చుట్టుముడుతున్న బ్లాక్ ఫంగస్…

  వాళ్ల శృంగారానికి పక్కింటోళ్ల గోల..

  కరోనాకి కొత్త లక్షణం.. ఓసారి పరీక్షించుకోండి..

  రఘురామకృష్ణంరాజు.. ఆమె చేతిలో పడ్డాడు