అక్కచెల్లెళ్లకోసం ఉరికంబం చూస్తోంది..

  0
  1781

  ప్రియుడికోసం కుటుంబంలో ఏడుగుర్ని చంపి ఉరికంబం కోసం ఎదురు చూస్తున్న షబ్నమ్ కంటే ముందు మరో ఇద్దరు మహిళలకోసం ఉరికంబం ఎదురు చూస్తోంది. వారిద్దరు అక్క చెల్లెళ్లు. అక్క పేరు రేణు షిండే, చెల్లి పేరు సీమా గవిట్. చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపడం వీరిద్దరికి అలవాటు. ఐదుగురి పిల్లల్ని ఇలా కిడ్నాప్ చేసి అన్యాయంగా చంపేశారు. మరో 13 కిడ్నాప్ కేసులు, 9 హత్య కేసుల్లో ఈ అక్క చెల్లెళ్లు దోషులు. సెషన్స్ కోర్టులో ఆరుగురు పిల్లల్ని చంపిన కేసులో వీరికి శిక్ష ఖరారు చేసి ఉరి విధించారు. హైకోర్టు కూడా వారికి ఉరిశిక్షను ఖరారు చేసింది. సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ పిటిషన్ తిరస్కరించారు. చివరకు రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పిటిషన్ ను 2014లో తిరస్కరించారు. అప్పటినుంచి వీరి ఉరిశిక్ష పెండింగ్ లోనే ఉంది.

  అత్యంత కిరాతక మనస్తత్వం..

  ఈ అక్కచెల్లెళ్లది అత్యంత కిరాతకమైన మనస్తత్వం. వాళ్ల తల్లి అంజనా బాయిది కూడా అదే రాక్షస మనస్తత్వం. ముగ్గురూ కలసి నేరాలు చేసేవాళ్లు. అంజనాబాయి చిన్న చిన్న దొంగతనాలు చేసేది. ఒకరోజు, కూతుళ్లిద్దరూ దేవాలయంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. అక్కడున్న భక్తులు వారిపై దాడి చేశారు. ఆ సమయంలో ఏడాది బాబు వాళ్ల దగ్గర ఉన్నాడు. రేణు భర్త కూడా దొంగతనాల వృత్తిలో ఉన్నాడు. పుణె, ముంబై, కొల్హాపూర్ నగరాల్లో వాహనాలు దొంగిలించి అమ్ముకునేవాడు. 1990 నుంచి 96 వరకు 43 మంది పిల్లల్ని వీరు కిడ్నాప్ చేశారు. వారిని దొంగతనాలకోసం ఉపయోగించుకుని ఆ తర్వాత చంపేసేవారు. పోలీసులు 13మంది పిల్లల హత్య కేసుల్ని కోర్టులో నిరూపించారు. ఓ సందర్భంలో జేబులు కొడుతుండగా పట్టుబడితే, తప్పించుకునేందుకు సొంత బిడ్డనే స్తంభానికేసి కొట్టి చంపేసి పారిపోయిన నీఛులు ఈ అక్కచెల్లెళ్లు. ఏడాదినుంచి 13ఏళ్లలోపు పిల్లల్ని వీరు కిడ్నాప్ చేసి చంపేసేవారు.

  జైలులోనే తల్లి మరణం..

  తల్లి అంజనాబాయి తనను వదిలేసిన భర్త రెండో పెళ్లి వలన కలిగిన కూతుర్ని చంపేందుకు కుట్ర చేస్తుండగా పట్టుబడింది. ఆ తర్వాత పోలీసుల విచారణలో వీరి నేరచరిత్ర మొత్తం బయటపడింది. ఆ తర్వాత మహరాష్ట్ర మొత్తం తల్లి, కూతుళ్ల నేర చరిత్రతో వణికిపోయింది. ఈ కేసులు విచారణలో ఉండగానే తల్లి అంజనా బాయి 1997లో జైలులోనే చనిపోయింది. అక్కచెల్లెళ్లిద్దరికీ ఉరిశిక్ష పడింది. వీరి ఉరిశిక్షకు ప్రస్తుతానికి ఏ ఆటంకం లేకపోయినా ఇంతవరకు వారిని ఉరికంబం మాత్రం ఎక్కించలేదు.

  దారుణ మారణకాండపై వెబ్ సిరీస్

  అన్నట్టు వీరిద్దరిపై ఓ వెబ్ సిరీస్ కూడా రూపొందింది. వీరిద్దరి హత్యాకాండను ప్రధానాంశంగా తీసుకుని హిందీలో వెబ్ సిరీస్ రూపొందించారు.

  https://www.youtube.com/watch?v=CI9TnWpeN_4

  ఇవి కూడా చదవండి:

  మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

  బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?