ఇలాంటోళ్లను చూస్తే దూరంగా ఉండండి..

  0
  77

  అస‌లే క‌రోనా భ‌యం… బ‌య‌టకు వెళ్ళాలంటే అంత‌కంటే భ‌యం…ప్ర‌మాదం ఏ మూల నుంచి వ‌స్తుందోన‌ని ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌తుకుతున్నాం మ‌నం. కానీ కొంత‌మంది చేసే నీచ‌మైన ప‌నులు ఇత‌రుల ప్రాణాల‌కు సంక‌టంగా మారుతున్నాయి. సిగ‌రెట్ల‌, మ‌ద్యం, పాన్ మ‌సాలాలు వంటివి ఆరోగ్యానికి ప్ర‌మాద‌క‌రం అన్న సంగ‌తి తెలిసీ కూడా వ్య‌స‌నానికి బానిసై తాగుతున్నారు. వీళ్ళు చేసే ప‌నులు ప‌క్క‌న ఉండేవాళ్ళకి ఎంత ఇబ్బంది క‌లిగిస్తాయో కూడా ఆలోచించ‌డం లేదు. అందుకు ఈ ఘ‌ట‌నే ఓ ఉదాహ‌ర‌ణ‌.
  బైక్ లో వెళుతున్న ఓ వ్య‌క్తి, అత‌ను న‌మిలిన‌ పాన్ మ‌సాలా వ్య‌ర్ధాన్ని ఇలా ఉమ్మి వేస్తున్నాడు. ప్ర‌స్తుత దారుణ‌మైన ప‌రిస్థితుల్లో ఇది ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో ఊహించండి. క‌రోనా వైర‌స్ గాలిలో ఆరు నిమిషాల పాటు ఉంటుంది. అత‌ను ఉమ్మిన ఎంగిలి వెన‌క వ‌చ్చే వాహ‌న‌దారుల‌పై గానీ, పాద‌చారుల‌పై గానీ ప‌డితే… అది వారికెంత ప్ర‌మాద‌మో ఊహించండి. కొంచెం కూడా బాధ్య‌త లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్న ఇలాంటి వెధ‌వ‌ల‌ను ఏమ‌నాలో మీరే చెప్పండి. ఆ వెధ‌వ వెన‌కే ప్ర‌యాణిస్తున్న‌ మ‌రో వ్య‌క్తి తీసిన ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

  వీ చదవండి

  టోల్ ఫీజు కట్టకుండా భలే ఐడియా .

  10వేలు ఇవ్వండి.. శవం తగలబెట్టుకోండి..

  ట్రిమ్ప్ ట్రైడెంట్ మోటార్ బైక్ స్పెషాలిటీ ఏమిటో ..?

  విగ్రహాన్ని నది ప్రవాహంలో వదిలితే , ఎదురొచ్చి మళ్ళీ పూజారి దగ్గరకే వస్తుంది.