దేవుడా నాకు కారు కావాలి , ప్రియురాలి కివ్వాలి..

  0
  52

  మూర్కుల్లో ఇత‌డి మార్క్ మురాదిరా అనే వ్య‌క్తికి ఫ‌స్ట్ ప్లేస్ ఇవ్వొచ్చు. తాను 40 రోజులు ఉప‌వాసం ఉంటే లంబోర్గ‌ని కారు దేవుడు ప్ర‌సాదిస్తాడ‌నే న‌మ్మ‌కంతో ఉప‌వాస‌దీక్ష చేసి చావుబ‌తుకుల మ‌ధ్య ఆస్ప‌త్రిలో ఉన్నాడు. ఇంత‌కీ అత‌ను ఈ దీక్ష చేసింది… లాంబోర్గినీ కారుని త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇవ్వ‌డం కోసం. మార్క్ గ‌ర్ల్ ఫ్రెండ్ కి లాంబోర్గిని కారంటే మ‌హా ఇష్ట‌మ‌ట‌. మార్క్ నిరుద్యోగి. పెద్ద‌గా ఆస్తులు కూడా లేవు. అందువ‌ల్ల తాను 40 రోజులు ఉంటాన‌ని, అందుకు ప్ర‌తిగా లాంబోర్గిని కారు ఇస్తే, త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ కి కారు గిఫ్ట్ గా ఇస్తాన‌ని దేవుడికి మొక్కుకున్నాడు.

  దేవుడికి ఈ మూర్ఖుడి మొర వినిపించిన‌ట్లు లేదు. 33 రోజుల త‌ర్వాత ఈ మూర్ఖ‌పు ప్రేమికుడు కోమాలోకి వెళ్ళిపోయాడు. దీంతో అత‌ని స్నేహితులు చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కావ‌డంతో మార్క్ స‌హ‌కారంతో అత‌ని ప్రియురాలికి లాంబోర్గ‌ని కారు కొనిచ్చేందుకు స‌హాయం చేయండి అంటూ కోటి 54 ల‌క్ష‌ల కారు కోసం ఫండ్ రైజింగ్ క్యాంప్ చేప‌ట్టారు. అయితే కేవ‌లం 3వేల రూపాయ‌లు మాత్ర‌మే వ‌సూల‌య్యాయి. ఇక మార్క్ ఆస్ప‌త్రి బిల్లు 30 వేలు అయింది. దీంతో కిందా మీద ప‌డిన మార్క్ స్నేహితులు న‌గ‌దు పోగు చేసి ఆస్ప‌త్రి బిల్లు క‌ట్టారు. జింబాంబ్వేలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

   

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..