బట్టలూడదీసి, ఫొటోలు తీసి..

  0
  3697

  మద్యం తాగమని బలవంతం చేయడమే కాకుండా, బట్టలు ఊడదీసి, నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసి, తనను గాయపరిచారంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సినీ నటి, జోగిని శ్యామలపై ఆమె కంప్లయింట్ ఇచ్చింది. ఆమెతోపాటు మరో 15మంది కూడా తనపై దారుణానికి ఒడిగట్టారని ఆ యువతి, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  అసలేంటీ కేసు..?
  హైదరాబాద్ గాందీ నగర్ ‌కు చెందిన ఓ యువతి తన తల్లితో కలిసి ఈ నెల 12వ తేదీన మెదక్ జిల్లా ఏడుపాయల సమీపంలోని నాగసాన్‌ పల్లిలోని వనదుర్గ భవాణి దేవి దేవాలయానికి వెళ్లింది.
  అక్కడ దర్శనం పూర్తయిన తర్వాత అదే దేవాలయానికి వచ్చిన జోగిని శ్యామలను ఆ యువతి కలిసిందట. శ్యామల తాను ఉంటున్న ప్రదేశానికి రావాలని సదరు యువతి, ఆమె తల్లిని ఆహ్వానించిందట. రాత్రి 8 గంటల సమయంలో శ్యామలతోపాటు ఆమె ఉంటున్న రూమ్ కి తల్లీ కూతుళ్లు వెళ్లారు. అక్కడ మరో 15మంది యువకులు ఫుల్లుగా మందు కొడుతూ హంగామా చేస్తున్నారు. వారితోపాటు సదరు యువతిని కూడా మందుకొట్టాలని ప్రోత్సహించారట. ఆమె నిరాకరించడంతో ఆమెపై దాడి చేసి, బట్టలూడదీసి నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీశారని బాధితురాలు ఫిర్యాదులే పేర్కొంది. డ్రైవర్ సహాయంతో అక్కడినుంచి తప్పించుకుని నగరానికి వచ్చిన యువతి.. మూడు రోజుల తర్వాత నేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  పంజాగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసుని మెదక్‌ జిల్లా పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌ కు బదిలీ చేశారు.

  ఇవీ చదవండి…

  అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

  ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??