ఒక అమ్మాయి ఇలా చేసింది.. అలా అయింది.

  0
  359

  అమ్మాయిలకు అబ్బాయిలు తమ ప్రేమను ప్రపోజ్ చేయడం సాధారణంగా జరిగేదే. అయితే ఇక్కడ మాత్రం ఓ అమ్మాయి, అబ్బాయికి ప్రపోజ్ చేసింది. అదికూడా పాకిస్తాన్ లో. ఈ వార్తతో కలకలం చెలరేగి లాహోర్ యూనివర్శిటీ ఆ ఇద్దరు స్టూడెంట్స్ ని సస్పెండ్ చేసింది. యూనివర్శిటీలో చదివే ఓ అమ్మాయి, తన క్లాస్ మేట్ కి బొకేతో స్నేహితులందరూ చూస్తుండగా ప్రపోజ్ చేసింది.

  యూనివర్శిటీ ఆవరణలోనే కౌగిలించుకున్నారు.

  ప్రియుడి ముందు మోకాళ్లమీద వంగి తాను ప్రేమిస్తున్నాను, తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. చుట్టూ ఫ్రెండ్స్ అందరూ చప్పట్లు కొడుతుండగా, ఆ ఇద్దరూ యూనివర్శిటీ ఆవరణలోనే కౌగిలించుకున్నారు. ఆ తర్వాత యూనివర్శిటీ క్రమశిక్షణా సంఘం వారిద్దరికీ నోటీసులిచ్చింది. వారి స్పందించకపోవడంతో ఇద్దర్నీ యూనివర్శిటీ నుంచి సస్పెండ్ చేసింది. ఇతర దేశాల్లో ఇలాంటి లవ్ స్టోరీలు, లవ్ ప్రపోజల్స్ సహజంగా జరిగేవే అయినా.. పాకిస్తాన్ లో మాత్రం బహిరంగంగా ఇలాంటి సీన్లు ఎక్కడా కనిపించవు. కానీ ఆ అమ్మాయి మాత్రం ధైర్యం చేసింది. తన ప్రియుడికి అందరి ముందు ప్రపోజ్ చేసి టాలెంట్ చూపించింది. అయితే యూనివర్శిటీ అధికారులు మాత్రం ప్రేయసీ ప్రియులిద్దరికీ షాక్ ఇచ్చారు.

  ఇవీ చదవండి…

  అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

  ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??