మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు…

    0
    648

    మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు…
    =================///
    ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్ జారీ చెయ్యాలన్న పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరపాలని ఆదేశించింది. దీంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పలు పిటిషన్ ల‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ ఇచ్చి 11 నెలలు గడచినందున తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో నామనేషన్లు వేయనీయకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. పాత నోటిఫికేషన్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. యథావిధిగా మార్చి 10న పోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని ఆదేశాలు జారీ చేసింది.

    ఇవీ చదవండి:

    అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

    ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

    ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?