రాధిక, శరత్ కుమార్ కు ఏడాది జైలు శిక్ష.

  0
  84

  సినీ నటులు రాధిక, శరత్ కుమార్ కు ఏడాది జైలు శిక్ష..
  చెల్లని చెక్కు కేసులో సినీ నటులు రాధిక, ఆమె భర్త శరత్ కుమార్ కి ఏడాది జైలు శిక్ష, 5 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తూ స్పెషల్ కోర్టు తీర్పు చెప్పింది. రాధిక శరత్ కుమార్ లు 2018లో ఓ వ్యక్తి వద్దనుంచి 1.5కోట్ల రూపాయలు తీసుకుని చెక్కులు ఇచ్చారు. ఆ తర్వాత శరత్ కుమార్ మరో 50లక్షలు తీసుకుని 5 చెక్కులు ఇచ్చాడు. ఈ చెక్కుల్లో ఒక్కటి కూడా పాస్ కాకపోవడంతో చెక్కులిచ్చిన యజమాని కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశాడు. తమపై పెట్టిన క్రిమినల్ సెక్షన్లు రద్దు చేయాలని, గతంలో రాధిక, శరత్ కుమార్ పిటిషన్ వేసినా దాన్ని హైకోర్టు తిరస్కరించింది. 6 నెలల లోగా కేసు విషయం తేలాలని ఆదేశించింది. చెన్నై కలెక్టరేట్ ప్రాంగణంలో ఉండే స్పెషల్ కోర్టులో చెక్కుల కేసు విచారణ జరిగింది. చెల్లని చెక్కుల కేసులో ఇద్దరినీ దోషులుగా పరిగణిస్తూ ఏడాది జైలుశిక్ష 5కోట్ల రూపాయల జరిమానా విధించారు. ఆ తర్వాత శరత్ కుమార్ పెట్టుకున్న పిటిషన్ ని అనుమతించి, జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుని తమ వద్దకు రావాలని ఆదేశించారు. లేని పక్షంలో జైలుకి వెళ్లక తప్పదని ఆదేశించారు.

   

  ఇవీ చదవండి

  ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

  నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

  మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

  సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు